నన్ను తేలిగ్గా తీసుకోవద్దు.. ఫడ్నవీస్ను హెచ్చరించిన ఏక్నాథ్ షిండే…
మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్, డిప్యూటీ సీఎం, శివసేన చీఫ్ ఏక్నాథ్ షిండే మధ్య అగాధం పెరుగుతోందన్న ఊహాగానాల నేపథ్యంలో తాజాగా షిండే చేసిన వ్యాఖ్యలు దీనిని బలపరిచాయి. తనను తేలిగ్గా తీసుకోవద్దంటూ ఆయన చేసిన హెచ్చరికలు కూటమిలో లుకలుకలను బయటపెట్టాయి. ఫడ్నవీస్ సమావేశాలకు దూరంగా ఉంటున్న షిండే.. తనను ఒకసారి తేలిగ్గా తీసుకున్నందుకు 2022లో ఉద్ధవ్ థాకరే నేతృత్వంలోని ప్రభుత్వం కూలిపోయిందని గుర్తు చేశారు. షిండే సీఎంగా ఉన్న సమయంలో ఆమోదించిన రూ.900 కోట్ల…