అభయారణ్యంలో 4 పులి పిల్లలు మృతి
మహారాష్ట్రలోని చంద్రపూర్ జిల్లాలోని తడోబా అంధారి టైగర్ రిజర్వ్ (టీఏటీఆర్)లోని బఫర్ జోన్‌లో శనివారం నాలుగు పులి పిల్లలు చనిపోయాయి. అటవీశాఖ అధికారి తెలిపిన వివరాల ప్రకారం.. పులి పిల్లలపై గాయపడిన గుర్తులు కనిపించాయి. వాటిని పులి చంపిందని తేలింది. శనివారం ఉదయం బఫర్ జోన్‌లోని శివ్‌ని ఫారెస్ట్ రేంజ్‌లో మూడు నుంచి నాలుగు నెలల వయసున్న రెండు మగ, రెండు ఆడ పిల్లల మృతదేహాలు లభ్యమైనట్లు రిజర్వ్‌లోని చీఫ్ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్ డాక్టర్ జితేంద్ర…

