National

APNationalTELANGANA

బనకచర్లపై నో డిస్కషన్.. : సీఎం రేవంత్..

ఢిల్లీలో తెలుగు రాష్ట్రాల సీఎంల సమావేశం ముగిసింది. కేంద్ర మంత్రి సీఆర్ పాటిల్ ఆధ్వర్యంలో సీఎంలు చంద్రబాబు, రేవంత్ రెడ్డిలు భేటీ అయిన విషయం తెలిసిందే ఈ సమావేశంలో ఇరు రాష్ట్రాల నీటి పారుదల శాఖ మంత్రులు, అధికారులు కూడా పాల్గొన్నారు. రెండు రాష్ట్రాల మధ్య నీటి వివాదాల ఎజెండాగానే దాదాపు గంటన్నర పాటు ఈ సమావేశం జరిగింది. గోదావరి బనకచర్ల ప్రాజెక్టును సింగిల్ పాయింట్ ఎజెండాగా ఏపీ ప్రతిపాదించగా.. తెలంగాణ ప్రభుత్వం 13 అంశాలను ఎజెండాలో…

National

కేంద్ర కేబినెట్ పలు కీలక నిర్ణయాలకు ఆమోదం..!

కేంద్ర కేబినెట్ పలు కీలక నిర్ణయాలకు ఆమోదం తెలిపింది. ‘పీఎం ధన్ ధాన్య కృషి యోజన’ పథకానికి ఆమోదం తెలిపినట్లు కేంద్ర మంత్రి అశ్వినీ వైష్ణవ్ మీడియాకు వెల్లడించారు. వ్యవసాయం, అనుబంధ రంగాలు అభివృద్ధి లక్ష్యంగా దేశవ్యాప్తంగా 100 జిల్లాల్లో ఈ పథకాన్ని అమలు చేయనున్నారు. 2025-26 నుంచి ఆరేళ్ల కాలానికి ఈ పథకం 100 జిల్లాలను కవర్ చేసేలా ప్రణాళిక రూపొందించారు.   వ్యవసాయ రంగంలో ఉత్పాదకతను పెంచడం, పంటల్లో వైవిధ్యీకరణ, స్థిరమైన వ్యవసాయ పద్ధతులను…

National

విమాన ఇంజిన్ వైఫల్యాలు.. డీజీసీఏ నివేదికలో కీలక విషయాలు..

భారతదేశంలో గత ఐదేళ్లలో 65 విమాన ఇంజిన్ వైఫల్యాలు నమోదయ్యాయని డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (డీజీసీఏ) విడుదల చేసిన నివేదికలో వెల్లడించింది. అహ్మదాబాద్ ఎయిరిండియా ప్రమాదం జరిగిన తర్వాత ప్రపంచవ్యాప్తంగా వివిధ విమానయాన సంస్థలు తమ విమానాల ఇంజిన్‌లు, ఇంధన స్విచ్‌లు మొదలైన వాటిపై అప్రమత్తమయ్యాయి. ప్రమాదాలను నివారించేందుకు తగిన జాగ్రత్తలు తీసుకుంటున్నాయి. ఈ నేపథ్యంలో డీజీసీఏ ఒక నివేదికను విడుదల చేసింది.   ఈ నివేదికలో కొన్ని కీలక అంశాలను వెల్లడించింది. జనవరి…

National

బాంబే స్టాక్ ఎక్స్‌చేంజ్‌కు బాంబు బెదిరింపులు ..

బాంబే స్టాక్ ఎక్స్‌చేంజ్‌కు బాంబు బెదిరింపులు రావడం కలకలం రేపింది. భవనంలో నాలుగు ఆర్డీఎక్స్‌ ఐఈడీ బాంబులు అమర్చామని, మధ్యాహ్నం 3 గంటలకు పేల్చేయబోతున్నట్లు మెయిల్ వచ్చింది.   మెయిల్‌లో బెదిరింపు కామ్రేడ్ పినరయి విజయన్ అనే మెయిల్ ఐడీతో బెదిరింపులు వచ్చినట్లు పోలీసులు తెలిపారు. బాంబు స్వ్కాడ్‌తో ముమ్మరంగా గాలించారు. దీనితో వెంటనే భవనాన్ని ఖాళీ చేయించి, బాంబ్ స్క్వాడ్‌, డాగ్ స్క్వాడ్‌, ఫైర్‌ సర్వీసుల బృందాలను రంగంలోకి దింపారు. BSE పరిసర ప్రాంతాల్లో ట్రాఫిక్‌ను…

National

డ్యూటీలో మహిళా పోలీస్‌లు ఆభరణాలు ధరించడం, మేకప్ వేసుకోవడంపై బీహార్ పోలీసుల నిషేధం..

మహిళా పోలీసులు డ్యూటీలో ఉన్నప్పుడు నగలు ధరించకూడదని, మేకప్ వేసుకోకూడదని బీహార్ పోలీస్ హెడ్ క్వార్టర్స్ ఆదేశాలు జారీచేసింది. దీనిని అతిక్రమించిన వారిపై క్రమశిక్షణ చర్యలు తప్పవని హెచ్చరించింది. అదనపు డైరెక్టర్ జనరల్ (లా) పంకజ్ దరాద్ సంతకంతో ఈ ఆదేశాలు జారీ అయ్యాయి.   కానిస్టేబుళ్ల నుంచి సీఐల వరకు అందరికీ ఈ ఆదేశాలు వర్తిస్తాయని ఆదేశాల్లో పేర్కొన్నారు. అలాగే, ముక్కు, చెవులకు రింగులు ధరించడం, గాజులు, ఆభరణాలు ధరించడం, విధుల్లో ఉన్నప్పుడు కాస్మొటిక్స్ ఉపయోగించడంపైనా…

National

కుప్పకూలిన ఎయిర్ ఫోర్స్ విమానం.. పైలెట్ మృతి..

రాజస్థాన్ రాష్ట్రంలోని చురు జిల్లాలో బుధవారం మధ్యాహ్నం.. ఘోర విమాన ప్రమాదం చోటుచేసుకుంది. ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌కు చెందిన ఒక ఫైటర్ జెట్‌ విమానం.. రతన్‌గఢ్ ప్రాంతంలోని ఓ పొలాల్లోకి కుప్పకూలింది. ఈ ప్రమాదంలో పైలెట్ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. మరో పైలెట్‌‌కి తీవ్ర గాయాలు అయినట్లు తెలుస్తోంది. గమనించిన స్థానికులు వెంటనే పోలీసులకు, ఎయిర్ ఫోర్స్‌ అధికారులు సమాచారం అందించారు. ప్రస్తుతం ఘటనా స్థలంలో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి.   ప్రమాదం వివరాలు సాధారణ శిక్షణ…

National

బ్రెజిల్‌లో ప్రధాని మోదీకి ప్రవాస భారతీయుల ఘన స్వాగతం..

బ్రెజిల్ పర్యటనలో ఉన్న భారత ప్రధాని నరేంద్ర మోదీకి ఆ దేశ రాజధాని బ్రాసిలియాలో ఘన స్వాగతం లభించింది. సోమవారం బ్రాసిలియా చేరుకున్న ఆయనకు ప్రవాస భారతీయులు త్రివర్ణ పతాకాలతో ఆత్మీయంగా స్వాగతం పలికారు. రియో డి జనీరోలో 17వ బ్రిక్స్ సదస్సును విజయవంతంగా ముగించుకున్న ప్రధాని, అధికారిక పర్యటన నిమిత్తం బ్రాసిలియా విచ్చేశారు.   విమానాశ్రయంలో బ్రెజిల్ రక్షణ మంత్రి జోస్ మ్యూసియో మొంటెరో ఫిల్హో ఆయనకు లాంఛనంగా స్వాగతం తెలిపారు. ఈ సందర్భంగా బ్రెజిల్…

National

ఖాజాగూడ కబ్జా కేసులో కీలక మలుపు.. ఐదుగురికి హైకోర్టు నోటీసులు..!

ఖాజాగూడలోని ప్రభుత్వ స్థలాన్ని కబ్జారాయుళ్ల చెరనుంచి కాపాడేందుకు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు నడుంబిగించారు. ప్రభుత్వ భూమిని రక్షించాల్సిన అధికారులే నిర్లక్ష్యం వహించడంతో.. ఎమ్మెల్యేలు హైకోర్టుని ఆశ్రయించారు. కబ్జా స్థలాల్లో జరుగుతున్న నిర్మాణాలను అడ్డుకోవాలని కోరారు. జడ్జర్ల ఎమ్మెల్యే అనిరుధ్‌ రెడ్డి, మహబూబ్ నగర్ ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి, మహబూబాబాద్ ఎమ్మెల్యే భూక్యా మురళీనాయక్‌, నాగర్ కర్నూల్ ఎమ్మెల్యే కూచుకుల్ల రాజేశ్‌ రెడ్డి.. ఈమేరకు హైకోర్టులో పబ్లిక్ ఇంట్రస్ట్ లిటిగేషన్ దాఖలు చేశారు. ఈ పిల్ పై విచారణ…

National

బ్రిక్స్ వేదికగా పాక్‌పై మోదీ ఘాటు వ్యాఖ్యలు..!

ఉగ్రవాద బాధితులను, ఉగ్రవాదాన్ని ప్రోత్సహించేవారిని ఒకే తక్కెడలో తూయలేమని ప్రధాని నరేంద్ర మోదీ స్పష్టం చేశారు. బ్రెజిల్‌లో జరుగుతున్న బ్రిక్స్ దేశాల శిఖరాగ్ర సదస్సులో ఆయన మాట్లాడుతూ, ఉగ్రవాదానికి మద్దతిస్తున్న పాకిస్థాన్‌పై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ఉగ్రవాదం విషయంలో కొందరు తమ రాజకీయ, వ్యక్తిగత ప్రయోజనాల కోసం మౌనంగా ఉండటాన్ని కూడా ఆయన తప్పుపట్టారు.   ఇటీవల జమ్మూకశ్మీర్‌లోని పహల్గామ్‌లో పాకిస్థాన్ ప్రేరేపిత ఉగ్రవాదులు జరిపిన దాడిలో 26 మంది పర్యాటకులు ప్రాణాలు కోల్పోయిన సంగతి తెలిసిందే. ఈ…

National

డెంగ్యూపై పోరులో కీలక ముందడుగు.. త్వరలో అందుబాటులోకి టీకా..!

దేశంలో ఏటా వర్షాకాలంలో లక్షలాది మందిని వణికిస్తున్న డెంగ్యూ మహమ్మారికి అడ్డుకట్ట వేసే దిశగా భారత్ కీలక ముందడుగు వేసింది. దేశీయంగా అభివృద్ధి చేసిన మొట్టమొదటి డెంగ్యూ వ్యాక్సిన్ క్లినికల్ ప్రయోగాలు తుది దశకు చేరుకున్నాయి. ప్రయోగాలు విజయవంతమైతే, ఏడాదిలోగా ఈ వ్యాక్సిన్ ప్రజలకు అందుబాటులోకి వచ్చే అవకాశం ఉందని నిపుణులు అంచనా వేస్తున్నారు.ప్రఖ్యాత ఫార్మా సంస్థ సీరమ్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇండియా (ఎస్ఐఐ) ఈ వ్యాక్సిన్‌ను అభివృద్ధి చేసింది. ‘టెట్రావ్యాక్స్-డీవీ’ పేరుతో రూపొందించిన ఈ టీకా…