అలర్ట్… ఈ నెల 20న మెడికల్ షాపులు బంద్..! కారణం అదేనా..?
దేశవ్యాప్తంగా ఈ నెల 20వ తేదీన 12.4 లక్షలకు పైగా మెడికల్ షాపులు మూతపడనున్నాయి. ఆలిండియా అర్గనైజేషన్ ఆఫ్ కెమిస్ట్స్ అండ్ డ్రగ్గిస్ట్స్ (ఏఐఓసీడీ) దేశవ్యాప్త బంద్ కు పిలుపునిచ్చింది. కార్పొరేట్ కంపెనీల అండదండలతో నడుస్తున్న ఆన్‌లైన్ ఫార్మసీలు భారీ డిస్కౌంట్లు ఇస్తూ సంప్రదాయ మెడికల్ షాపులకు నష్టం కలిగిస్తున్నాయంటూ కెమిస్టులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. చిన్న ఫార్మసీ కంపెనీలు ఈ పోటీని తట్టుకోలేక ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయని వారు చెబుతున్నారు. అనియంత్రిత ఆన్‌లైన్ అమ్మకాలు,…

