మత్స్యకారుల వలకు చిక్కిన ఓ అరుదైన, వింతైన చేప..! ఎక్కడంటే..?
తమిళనాడు సముద్ర తీరంలో ఓ అరుదైన, వింతైన చేప మత్స్యకారుల వలకు చిక్కడం స్థానికంగా కలకలం రేపింది. సుమారు 30 అడుగుల పొడవున్న ఈ చేపను ‘ఓర్ ఫిష్’ అని పిలుస్తారు. సముద్ర గర్భంలో అత్యంత లోతున నివసించే ఈ జీవి కనిపించడం చాలా అరుదు. అయితే, ఈ చేప దర్శనం అరిష్టాలకు, ముఖ్యంగా భూకంపాలు, సునామీలు వంటి ప్రకృతి వైపరీత్యాలకు సంకేతమని కొన్ని దేశాల్లో బలంగా నమ్ముతారు. దీంతో, ఈ నెల ఆరంభంలో పట్టుబడిన ఈ…

