లోక్ సభ ముందుకు వక్ఫ్ బోర్డ్ సవరణ బిల్లు.. పాసయ్యేనా..?
పార్లమెంటులో జరుగుతున్న బడ్జెట్ సమావేశాలలో వక్ఫ్ బిల్లును బుధవారం లోక్ సభలో ప్రవేశ పెట్టాలని కేంద్రంలోని ఎన్డీయే ప్రభుత్వం నిర్ణయించింది. లోక్ సభ ప్రశ్నోత్తరాలు ముగిసిన తర్వాత.. అంటే మధ్యాహ్నం 12 గంటల తర్వాత ఈ బిల్లును కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు సభలో ప్రవేశపెట్టనున్నారు. వక్ఫ్ సవరణ బిల్లును ప్రతిపక్షాలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. ఇండియా కూటమిలోని పార్టీలు మంగళవారం ప్రత్యేకంగా సమావేశమై సభలో ఈ బిల్లును అడ్డుకోవాలని తీర్మానించాయి. ఇండియా కూటమి మొత్తం ఈ బిల్లుకు…

