సాంకేతిక రంగంలో భారత్ మరో భారీ ముందడుగు..! భారత్‌లో తొలి స్వదేశీ మైక్రోచిప్..
సాంకేతిక రంగంలో స్వయం సమృద్ధి దిశగా భారత్ మరో భారీ ముందడుగు వేసింది. భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) పూర్తిగా దేశీయ పరిజ్ఞానంతో అభివృద్ధి చేసిన ‘విక్రమ్ 3201’ అనే 32-బిట్ మైక్రోప్రాసెసర్‌ను మంగళవారం ఆవిష్కరించింది. ‘ఆత్మనిర్భర్ భారత్’ లక్ష్య సాధనలో ఇది ఒక కీలక మైలురాయిగా నిలవనుంది. ఢిల్లీలో జరిగిన సెమీకండక్టర్ పరిశ్రమల సమావేశంలో ఈ చిప్‌ను కేంద్ర ఎలక్ట్రానిక్స్, ఐటీ శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్ ప్రధాని నరేంద్ర మోదీకి అందించారు.…

