ఇరాన్ అనుమతి.. యూఏఈ, సౌదీల నుంచి భారత్కు బయల్దేరిన ఇంధన నౌకలు..
పర్షియన్ గల్ఫ్లో ఇరాన్, అమెరికా మధ్య తీవ్ర ఉద్రిక్తతలు కొనసాగుతున్న వేళ, దేశీయ ఇంధన అవసరాలను తీర్చేందుకు కేంద్ర ప్రభుత్వం పకడ్బందీ చర్యలు చేపట్టింది. క్షిపణులు, డ్రోన్ల దాడులతో అట్టుడుకుతున్న సముద్ర మార్గంలో భారత నౌకాదళం పటిష్ట భద్రత నడుమ మూడు కీలక ఇంధన నౌకలు భారత్కు బయల్దేరాయి. పరిస్థితి తీవ్రతను దృష్టిలో ఉంచుకుని, నౌకాదళ అధిపతి అడ్మిరల్ దినేశ్ త్రిపాఠి తన ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ పర్యటనను సైతం రద్దు చేసుకున్నారు. విశ్వసనీయ వర్గాల సమాచారం…

