మోడీని కలిసిన అమెరికా ఇంటెలిజెన్స్ చీఫ్.. పలు కీలక విషయాలపై చర్చ..!
న్యూఢిల్లీలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీతో సాయంత్రం అమెరికా జాతీయ నిఘా డైరెక్టర్ తులసి గబ్బర్డ్‌తో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఉగ్రవాదం, భద్రతా పరిస్థితులపై విస్తృతంగా చర్చలు జరిపారు. ఇస్లామిక్ ఉగ్రవాద ముప్పును ఓడించడానికి తులసి గబ్బర్డ్.. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ యొక్క ఉగ్రవాదంపై అచంచలమైన నిబద్ధతను పునరుద్ఘాటించారు. ఇది అమెరికన్ ప్రజలకు “ప్రత్యక్ష ముప్పు”గా అభివర్ణించారు. ఈ విషయాన్ని ప్రధాని మోదీతో కలిసి పరిగణిస్తామని తెలిపారు. ఈ నిరంతర ముప్పును ఎదుర్కోవడానికి రెండు దేశాలు కలిసి…

