ఎస్‌సీఓ వేదికగా ఉగ్రవాదంపై మోదీ ఘాటు వ్యాఖ్యలు..
‘షాంఘై సహకార సంస్థ’ (ఎస్‌సీఓ) శిఖరాగ్ర సదస్సు వేదికగా భారత ప్రధాని నరేంద్ర మోదీ ఉగ్రవాదంపై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. పాకిస్థాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ సమావేశంలో ఉండగానే, ఉగ్రవాదానికి బహిరంగంగా మద్దతునిస్తున్న కొన్ని దేశాల ద్వంద్వ వైఖరిని ఆయన తీవ్రంగా తప్పుబట్టారు. ఇటీవల కశ్మీర్‌లోని పహల్గామ్‌లో జరిగిన దారుణమైన ఉగ్రదాడిని గుర్తుచేస్తూ, ఇలాంటి చర్యలను ప్రపంచ సమాజం అంగీకరించాలా? అని సూటిగా ప్రశ్నించారు. సోమవారం టియాంజిన్‌లో జరిగిన ఎస్‌సీఓ సదస్సు ప్రారంభోపన్యాసంలో మోదీ మాట్లాడారు.…

