National

NationalTechnology

ఆకాశంలో అద్భుతం.. సెప్టెంబర్ 7న ‘బ్లడ్ మూన్’.. హైదరాబాద్ నుంచీ వీక్షించే అవకాశం..

ఖగోళ అద్భుతాల కోసం ఎదురుచూసేవారికి ఇది ఒక శుభవార్త. వచ్చే నెలలో ఆకాశంలో ఒక అరుదైన, కనువిందు చేసే దృశ్యం ఆవిష్కృతం కానుంది. సెప్టెంబర్ 7-8 తేదీల రాత్రి సంపూర్ణ చంద్రగ్రహణం ఏర్పడనుంది. ఈ గ్రహణం సమయంలో చంద్రుడు సాధారణం కంటే భిన్నంగా, ఎర్రటి నారింజ రంగులో ప్రకాశిస్తూ కనిపిస్తాడు. అందుకే దీనిని ‘బ్లడ్ మూన్’ లేదా రక్త చంద్రగ్రహణం అని పిలుస్తారు. దాదాపు 82 నిమిషాల పాటు ఈ అద్భుత దృశ్యాన్ని వీక్షించే అవకాశం కలగనుంది.…

National

చైనా పర్యటనకు ప్రధాని మోదీ.. జిన్‌పింగ్‌తో ద్వైపాక్షిక సమావేశం..

భారత్, చైనా సంబంధాలలో ఒక కీలక పరిణామం చోటుచేసుకోనుంది. సరిహద్దుల్లోని గల్వాన్ లోయలో 2020లో జరిగిన ఘర్షణల అనంతరం, ఏడేళ్ల సుదీర్ఘ విరామం తర్వాత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తొలిసారిగా చైనాలో పర్యటించనున్నారు. చైనాలోని టియాంజిన్‌లో జరగనున్న షాంఘై సహకార సంస్థ (ఎస్సీఓ) శిఖరాగ్ర సదస్సు సందర్భంగా ఆయన చైనా అధ్యక్షుడు జీ జిన్‌పింగ్‌తో ద్వైపాక్షిక సమావేశంలో పాల్గొంటారు. ఈ కీలక భేటీ ఆదివారం జరగనుంది.   జపాన్ లో త‌న‌ రెండు రోజుల పర్యటన ముగించుకుని…

National

కర్ణాటకలో వింత.. నీలం రంగు గుడ్డు పెట్టిన నాటు కోడి..!

కర్ణాటకలోని ఓ చిన్న గ్రామంలో జరిగిన ఓ విచిత్ర సంఘటన ఇప్పుడు అందరి దృష్టినీ ఆకర్షిస్తోంది. దావణగెరె జిల్లా, చన్నగిరి తాలూకాలోని నల్లూరు గ్రామంలో ఓ సాధారణ నాటు కోడి నీలం రంగులో ఉన్న గుడ్డు పెట్టడమే ఈ ఆశ్చర్యానికి కారణం. ఈ వింత గుడ్డును చూసేందుకు చుట్టుపక్కల గ్రామాల ప్రజలు తండోపతండాలుగా తరలివస్తున్నారు.   వివరాల్లోకి వెళితే.. నల్లూరు గ్రామానికి చెందిన సయ్యద్ నూర్ అనే రైతు జీవనోపాధి కోసం పది నాటు కోళ్లను పెంచుకుంటున్నాడు.…

National

ఆధార్ తో ధ్రువీకరణ… ఒప్పందం కుదుర్చుకున్న స్టార్‌లింక్..!

భారత్‌లో శాటిలైట్ ఆధారిత బ్రాడ్‌బ్యాండ్ సేవలను అందించేందుకు కేంద్ర ప్రభుత్వం అనుమతి ఇచ్చిన నేపథ్యంలో ఎలాన్ మస్క్ నేతృత్వంలోని స్టార్‌లింక్ సంస్థ మరో కీలక ముందడుగు వేసింది. వినియోగదారుల వెరిఫికేషన్ ప్రక్రియను వేగవంతం చేయాలనే లక్ష్యంతో భారత విశిష్ట గుర్తింపు ప్రాధికార సంస్థ (యూఐడీఏఐ)తో స్టార్‌లింక్ ఒప్పందం కుదుర్చుకుంది.   ఈ ఒప్పందం ద్వారా స్టార్‌లింక్ సంస్థ ఆధార్ ఆధారిత డిజిటల్ ధ్రువీకరణ (ఈకేవైసీ) విధానాన్ని ఉపయోగించనుంది. భారత్‌లో ఎక్కువ మంది పౌరుల వద్ద ఇప్పటికే ఆధార్…

National

సూరత్‌లో రూ.25 కోట్ల విలువైన వజ్రాల చోరీ..

గుజరాత్‌లోని సూరత్ నగరంలో భారీ వజ్రాల చోరీ కలకలం సృష్టించింది. ప్రముఖ డైమండ్ కంపెనీ డీకే అండ్ సన్స్ కార్యాలయంలో గుర్తు తెలియని దుండగులు సుమారు రూ.25 కోట్ల విలువైన వజ్రాలను అపహరించారు. ఈ సంఘటన కపోద్రా ప్రాంతంలోని కంపెనీ ఆఫీస్ కమ్ పాలిషింగ్ యూనిట్‌లో ఆగస్టు 15 నుంచి 17 మధ్య చోటుచేసుకుంది.   పోలీసుల ప్రాథమిక దర్యాప్తు ప్రకారం.. కంపెనీకి మూడు రోజుల పాటు సెలవులు ఉండటంతో మూసివేశారు. ఈ అవకాశాన్ని వినియోగించుకున్న దుండగులు…

National

బెంగళూరులో ఐఫోన్ 17 ఉత్పత్తి షురూ..!

ఎలక్ట్రానిక్ ఉత్పత్తుల తయారీలో ప్రపంచ ప్రఖ్యాత సంస్థ ఫాక్స్‌కాన్, భారత్‌లో తన కార్యకలాపాలను మరింత విస్తరించింది. టెక్ దిగ్గజం యాపిల్‌కు చెందిన సరికొత్త ఐఫోన్ 17 ఉత్పత్తిని బెంగళూరులోని తన ప్లాంట్‌లో ప్రారంభించినట్లు అధికారిక‌ వర్గాలు తెలిపాయి. ఇప్పటికే చెన్నైలోని యూనిట్‌లో ఐఫోన్ల తయారీ జరుగుతుండగా, ఇప్పుడు బెంగళూరులోనూ ఈ ప్రక్రియ మొదలుకావడం ‘మేడ్ ఇన్ ఇండియా’ ప్రణాళికలకు పెద్ద ఊపునిచ్చినట్లయింది.   చైనా వెలుపల ఫాక్స్‌కాన్‌కు ఇది రెండో అతిపెద్ద తయారీ కేంద్రం కావడం గమనార్హం.…

National

ఎన్డీఏ ఉపరాష్ట్రపతిగా మహారాష్ట్ర గవర్నర్ సీపీ రాధాకృష్ణన్..

ఉపరాష్ట్రపతి అభ్యర్థి పేరును ఎన్డీఏ ఖరారు చేసింది. ప్రస్తుతం మహారాష్ట్ర గవర్నర్ గా పని చేస్తున్న సీపీ రాధాకృష్ణన్ ఉపరాష్ట్రపతి పదవికి నామినేషన్ వేయబోతున్నట్టు బీజేపీ నేషనల్ ప్రెసిడెంట్ జేపీ నడ్డా ప్రకటించారు. తమిళనాడులో జన్మించిన రాధాకృష్ణన్ తెలంగాణ గవర్నర్ గా కూడా పని చేసిన విషయం తెలిసిందే.   సీపీ రాధాకృష్ణన్ తమిళనాడు బీజేపీ అధ్యక్షుడిగా కూడా పని చేశారు. రెండు సార్లు కోయంబత్తూరు ఎంపీగా పని చేసిన అనుభవం కూడా ఉంది. గతంలో జార్ఖండ్…

National

ఒడిశాలో బయటపడ్డ బంగారు ఖనిజ నిక్షేపాలు..

ఒడిశాలో భారీ స్థాయిలో బంగారు ఖనిజ నిక్షేపాలు బయటపడినట్లు జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా (జీఎస్ఐ) ప్రకటించింది. రాష్ట్రంలోని పలు జిల్లాల్లో సుమారు 10 నుంచి 20 మెట్రిక్ టన్నుల నిక్షేపాలను గుర్తించినట్లు తెలిపింది. సుందర్ గఢ్, నవరంగ్ పూర్, కియోంజర్, దేవగఢ్ జిల్లాల్లో ఇప్పటికే బంగారు నిక్షేపాల వెలికితీత పెద్ద ఎత్తున కొనసాగుతోంది. ఈ క్రమంలో మైనింగ్ కార్పొరేషన్, జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా సంయుక్తంగా ఈ పరిశోధనలు చేపట్టాయి. అంతర్జాతీయ మార్కెట్లో పసిడి ధర…

National

ప్రపంచ వేదికపై భారత్‌కు సముచిత గౌరవం లభిస్తోంది: పుతిన్ ప్రశంస..

భారత స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకుని ప్రపంచ దేశాల నుంచి శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. ముఖ్యంగా రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్, భారత్ సాధించిన విజయాలను కొనియాడుతూ, ప్రపంచ వేదికపై దేశానికి ‘సముచిత గౌరవం’ లభిస్తోందని ప్రశంసించారు. ఫ్రాన్స్, అమెరికాతో దేశాల అధినేతలు కూడా భారత్‌కు అభినందనలు తెలియజేశారు.   “ఆర్థిక, సామాజిక, శాస్త్రీయ, సాంకేతిక రంగాలతో పాటు ఇతర అనేక రంగాల్లో భారతదేశం సాధించిన విజయాలు అందరికీ తెలిసినవే. అంతర్జాతీయ వేదికపై మీ దేశానికి గొప్ప గౌరవం లభిస్తోంది.…

National

అమెరికా నుంచి భారీగా చమురు కొంటున్న భారత్..!

అంతర్జాతీయంగా మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా భారత్ తన ఇంధన వ్యూహాన్ని వేగంగా మార్చుకుంటోంది. ఇందులో భాగంగా అమెరికా నుంచి ముడి చమురు దిగుమతులను భారీగా పెంచుతోంది. దేశంలోని అతిపెద్ద చమురు సంస్థ అయిన ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ (ఐఓసీ), తాజాగా ఆగస్టు నెలలో దాదాపు 20 లక్షల బ్యారెళ్ల అమెరికా ముడి చమురుకు ఆర్డర్ ఇచ్చింది. ఈ చమురు అక్టోబర్ నాటికి భారత్‌కు చేరనుంది.   ఇంధన అవసరాల కోసం కొన్ని దేశాలపైనే ఆధారపడకుండా, దిగుమతి వనరులను…