దేశవ్యాప్తంగా బీఎస్ఎన్ఎల్ స్వదేశీ 4జీ నెట్వర్క్… ప్రారంభించిన ప్రధాని మోదీ..
ప్రభుత్వ రంగ టెలికాం సంస్థ భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్ (బీఎస్ఎన్ఎల్) ఎన్నో ఏళ్లుగా ఎదురుచూస్తున్న స్వదేశీ 4జీ సేవలను దేశవ్యాప్తంగా అందుబాటులోకి తెచ్చింది. శనివారం ఒడిశాలోని ఝార్సుగూడలో జరిగిన ఒక కార్యక్రమంలో ప్రధాని నరేంద్ర మోదీ ఈ సేవలను లాంఛనంగా ప్రారంభించారు. పూర్తి భారతీయ పరిజ్ఞానంతో రూపొందించిన ఈ ‘భారత్ టెలికాం స్టాక్’ నెట్వర్క్ను జాతికి అంకితం చేశారు. ఈ చారిత్రాత్మక ఘట్టం ద్వారా టెలికాం రంగంలో ఆత్మనిర్భర్ భారత్ లక్ష్యం దిశగా దేశం ఒక…

