National

National

ఈసీ పై రాహుల్ గాంధీ సంచలన ఆరోపణలు..

కేంద్ర ఎన్నికల సంఘం (ఈసీ)పై కాంగ్రెస్ అగ్ర నేత, లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ సంచలన ఆరోపణలు చేశారు. ఈసీ ఇప్పుడు ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించే సంస్థగా కాకుండా, దాన్ని ఓ క్రమపద్ధతిలో కూల్చివేయడానికి సహకరిస్తోందని ఆయన తీవ్రంగా విమర్శించారు. బీజేపీతో ఈసీ కుమ్మక్కై ఎన్నికల ప్రక్రియను పూర్తిగా తారుమారు చేస్తోందని కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో ధ్వజమెత్తారు.   ఎన్నికల ప్రక్రియ, ఓటర్ల జాబితా విశ్వసనీయతపై ఆయన తీవ్ర అనుమానాలు వ్యక్తం…

National

పద్మనాభస్వామి ఆలయం బి-నేలమాళిగపై ఉత్కంఠ.. పూజారిదే తుది నిర్ణయం..!

ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన కేరళలోని శ్రీ పద్మనాభస్వామి ఆలయంలో అత్యంత రహస్యమైన ‘బి-నేలమాళిగ’ తెరిచే అంశం మరోసారి తీవ్ర చర్చనీయాంశంగా మారింది. దాదాపు ఐదేళ్ల విరామం తర్వాత తెరపైకి వచ్చిన ఈ వివాదంపై తుది నిర్ణయం తీసుకునే కీలక బాధ్యతను ఆలయ తంత్రికే (ప్రధాన పూజారి) అప్పగించారు. దీంతో ఈ మిస్టరీ వీడుతుందా లేదా అనే ఉత్కంఠ మళ్లీ మొదలైంది.   గురువారం తిరువనంతపురంలో ఆలయ పాలక మండలి, సలహా మండలి సంయుక్త సమావేశం జరిగింది. ఈ సమావేశంలో…

National

అప్ప‌టివ‌ర‌కు భారత్‌తో చర్చల్లేవ్.. తేల్చిచెప్పిన ట్రంప్..

అమెరికా, భారత్ మధ్య వాణిజ్య సంబంధాలు మరింత ఉద్రిక్తంగా మారాయి. భారత దిగుమతులపై సుంకాలను రెట్టింపు చేసిన అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, సుంకాల వివాదం పరిష్కారమయ్యే వరకు భారత్‌తో ఎలాంటి వాణిజ్య చర్చలు జరిపేది లేదని తేల్చిచెప్పారు. మరోవైపు, అమెరికా ఒత్తిళ్లకు తలొగ్గే ప్రసక్తే లేదని, రైతుల ప్రయోజనాలే తమకు అత్యంత ముఖ్యమని భారత ప్రధాని నరేంద్ర మోదీ స్పష్టం చేశారు. దీంతో ఇరు దేశాల మధ్య వాణిజ్య పోరు తీవ్ర స్థాయికి చేరినట్లయింది.  …

National

ఉత్తరాఖండ్ భారీ వరదలు..! ఊరు గల్లంతు.. భారీ ప్రాణ నష్టం..!

ఉత్తరాఖండ్‌లో భారీ వర్షాలు, వరదలు పెను బీభత్సం సృష్టిస్తున్నాయి. ఉత్తరకాశీలోని ధరాలీలో కొండపై నుంచి ఒక్కసారిగా వచ్చిన వరద బురదతో ఆ గ్రామం మొత్తం కొట్టుకుపోయింది. ఇప్పటికే నలుగురు మృత్యువాత పడగా, తాజాగా దాదాపు పది మంది సైనికులు వరదనీటిలో గల్లంతైనట్లు తెలుస్తోంది.   వరదకు తీవ్రంగా ప్రభావితమైన ధరాలీ గ్రామానికి కేవలం నాలుగు కిలోమీటర్ల దూరంలోనే ఆర్మీ బేస్ క్యాంప్ ఉంది. హర్షిల్ ఆర్మీ క్యాంపస్‌కు దిగువన ఉన్న సైనికులు వరద ఉద్ధృతికి కొట్టుకుపోయినట్లు తెలుస్తోంది.…

National

అందుబాటులోకి రానున్న ‘పాన్ 2.0’..

దేశంలోని పన్ను చెల్లింపుదారులకు ఆదాయ పన్ను శాఖ శుభవార్త చెప్పింది. పాన్ (శాశ్వత ఖాతా సంఖ్య), టాన్ (పన్ను తగ్గింపు, సేకరణ ఖాతా సంఖ్య) సంబంధిత సేవలను మరింత సులభతరం చేసేందుకు ఉద్దేశించిన ప్రతిష్ఠాత్మక ‘పాన్ 2.0’ ప్రాజెక్టును ప్రారంభించనుంది. ప్రస్తుతం మూడు వేర్వేరు పోర్టళ్లలో అందుబాటులో ఉన్న ఈ సేవలన్నింటినీ ఒకే గొడుగు కిందకు తెచ్చే ఈ భారీ ప్రాజెక్టు నిర్మాణ బాధ్యతలను ప్రముఖ ఐటీ సంస్థ ఎల్టీఐమైండ్‌ట్రీకి అప్పగించినట్లు ఓ ఉన్నతాధికారి సోమవారం వెల్లడించారు.…

National

జగదీప్ ధన్‌ఖడ్ రాజీనామా.. నూతన ఉప రాష్ట్రపతి ఎన్నిక కోసం షెడ్యూల్ విడుదల..

నూతన ఉపరాష్ట్రపతి ఎన్నికకు శుక్రవారం షెడ్యూల్ విడుదలైంది. ఈ మేరకు ఎన్నికల సంఘం షెడ్యూల్‌ను విడుదల చేసింది. సెప్టెంబర్ 9న నూతన ఉపరాష్ట్రపతి ఎన్నిక జరగనుంది. జగదీప్ ధన్‌ఖడ్ ఉపరాష్ట్రపతి పదవికి రాజీనామా చేయగా, దానిని రాష్ట్రపతి ఆమోదించడంతో నూతన ఉపరాష్ట్రపతి ఎన్నిక అనివార్యమైంది.   ఆగస్టు 7న నోటిఫికేషన్ విడుదల, 21న నామినేషన్‌ దాఖలుకు చివరి తేదీ, 22న స్క్రూటినీ ఉంటుంది. ఆగస్టు 25వ తేదీ వరకు నామినేషన్ ఉపసంహరణకు గడువు ఉంటుంది. సెప్టెంబర్ 9న…

National

ట్రంప్ 25 శాతం సుంకాలపై కేంద్రం స్పందన..

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారత్‌ నుంచి దిగుమతి చేసుకునే వస్తువులపై 25 శాతం సుంకం విధిస్తామని ప్రకటించిన నేపథ్యంలో, భారత కేంద్ర ప్రభుత్వం స్పందించింది. జాతీయ ప్రయోజనాలను రక్షించుకోవడానికి అన్ని చర్యలు తీసుకుంటామని కేంద్రం స్పష్టం చేసింది. ఈ నిర్ణయం భారత ఎగుమతులపై ప్రభావం చూపే అవకాశం ఉందని, అయినప్పటికీ దీనిని ఎదుర్కోవడానికి తగిన వ్యూహాలను రూపొందిస్తామని తెలిపింది.   ట్రంప్ ప్రభుత్వం విధించిన సుంకం వల్ల భారత్ నుంచి ఉక్కు, అల్యూమినియం, ఫార్మాస్యూటికల్స్, టెక్స్‌టైల్స్…

National

నాతో డీల్ చేయండి..! అమిత్ షా ఆసక్తికర వ్యాఖ్యలు..

‘ఆపరేషన్ సిందూర్’పై రాజ్యసభలో చర్చ సందర్భంగా కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తనతో డీల్ చేయాలని, ప్రధానమంత్రి వస్తే ఇంకా ఇబ్బందిపడతారంటూ విపక్షాలను ఉద్దేశించి వ్యాఖ్యానించారు.   చర్చలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పాల్గొనకపోవడాన్ని విపక్షాలు ప్రశ్నించాయి. కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ప్రధాని మోదీ హాజరుకాకపోవడాన్ని ప్రశ్నించారు. అమిత్ షా ప్రసంగిస్తుండగా విపక్షాలు వాకౌట్ చేశాయి.   అమిత్ షా మాట్లాడేందుకు నిలబడగానే విపక్షాలు ఆందోళనకు దిగాయి. సభలో ప్రధానమంత్రి…

National

నిప్పులు చిమ్ముకుంటూ నింగిలోకి జీఎస్ఎల్వీ-ఎఫ్16… విజయవంతంగా కక్ష్యలోకి ‘నైసార్’..

అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ నాసా, భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో సంయుక్తంగా రూపొందించిన నైసార్ ఉపగ్రహాన్ని మోసుకుంటూ, భారత వాహన నౌక జీఎస్ఎల్వీ-ఎఫ్16 నింగిలోకి దూసుకెళ్లింది. అత్యంత శక్తిమంతమైన అబ్జర్వేషన్ శాటిలైట్ నైసార్ ను విజయవంతంగా కక్ష్యలోకి చేర్చింది. ఈ ఉపగ్రహం బరువు 2,393 కిలోలు.   నైసార్ అంటే నాసా ఇస్రో సింథటిక్ అపెర్చర్ రాడార్. ఇందులో ఉండే రెండు భారీ డిష్ ల వంటి నిర్మాణాలు భూమిపైకి మైక్రోవేవ్, రేడియో వేవ్…

NationalSPORTS

భార‌త్‌, పాక్ సెమీస్ పోరుపై నీలినీడ‌లు.. త‌ప్పుకున్న స్పాన్స‌ర్‌..!

వ‌ర‌ల్డ్ ఛాంపియ‌న్ షిప్ ఆఫ్ లెజెండ్స్ (డ‌బ్ల్యూసీఎల్‌) 2025లో భాగంగా నిన్న‌ వెస్టిండీస్ ఛాంపియ‌న్స్‌తో జ‌రిగిన మ్యాచ్‌లో ఇండియా ఛాంపియ‌న్స్ విజ‌యం సాధించి సెమీ ఫైన‌ల్‌కు దూసుకెళ్లిన విష‌యం తెలిసిందే. ఇక‌, సెమీస్‌లో దాయాది పాకిస్థాన్‌తో భార‌త్ త‌ల‌ప‌డాల్సి ఉంది. అయితే, ఈ సెమీస్ పోరుకు భారీ అడ్డంకి ఏర్పడింది. ఇప్పటికే పాక్‌తో భారత్ ఆడే విషయంపై సందిగ్దత నెలకొనగా.. తాజాగా ఈ టోర్నీ స్పాన్సర్స్ ఈజ్‌మైట్రిప్‌ ఈ మ్యాచ్ స్పాన్స‌ర్‌షిప్ నుంచి త‌ప్పుకుంది. షెడ్యూల్ ప్రకారం…