రూ.840 కే నెలంతా అపరిమిత ఇంటర్నెట్ ఆఫర్ తో స్టార్ లింక్ ఎంట్రీ..!
ఎలాన్ మస్క్‌కు చెందిన స్టార్‌లింక్ సహా ప్రముఖ అంతర్జాతీయ శాటిలైట్ కమ్యూనికేషన్ సంస్థలు భారత మార్కెట్లోకి ప్రవేశించేందుకు ఆకర్షణీయమైన ప్రణాళికలు రచిస్తున్నాయి. వినియోగదారులను వేగంగా ఆకట్టుకునేందుకు, ప్రారంభంలో నెలకు రూ. 840 రూపాయలకే అపరిమిత డేటా ప్లాన్లను అందించాలని యోచిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ వ్యూహంతో మధ్య, దీర్ఘకాలంలో సుమారు కోటి మంది వినియోగదారులను చేర్చుకోవాలన్నదే ఈ సంస్థల టార్గెట్ అని నిపుణులు విశ్లేషిస్తున్నారు. అధిక స్పెక్ట్రమ్ ఖర్చులను పెద్ద సంఖ్యలో యూజర్లతో భర్తీ చేసుకోవచ్చనే వ్యూహంతో మార్కెట్…

