ఈ ముసుగు వ్యక్తి ఆచూకీ తెలిపిన వారికి రూ.10 లక్షల నగదు
సంచలనం సృష్టించిన బెంగళూరు రామేశ్వరం కేఫ్ పేలుడు ఘటన మరో మలుపు తీసుకుంది. ఈ ఘటనలో ప్రధాన నిందితుడి కోసం గాలిస్తోన్న జాతీయ దర్యాప్తు సంస్థ.. కీలక ప్రకటన విడుదల చేసింది. అతని ఫొటోలను విడుదల చేసింది. ఆచూకీ తెలియజేసిన వారికి 10 లక్షల రూపాయల నగదు బహుమతిని అందజేస్తామని ప్రకటించింది. బెంగళూరులోని ప్రఖ్యాత రామేశ్వరం కేఫ్‌లో భారీ పేలుడు సంభవించిన విషయం తెలిసిందే. ఈ ఘటనలో తొమ్మిది మంది తీవ్రంగా గాయపడ్డారు. వారంతా వేర్వేరు…

