కేజ్రీవాల్, ఆప్ సర్కారుపై బీజేపీ ఛార్జిషీట్..
ఫిబ్రవరిలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న కేంద్ర పాలిత ప్రాంతం ఢిల్లీలో రాజకీయాలు హీటెక్కాయి. మాజీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ సారధ్యంలోని ఆప్.. ప్రధాన ప్రతిపక్షం బీజేపీ పరస్పరం విమర్శనాస్త్రాలు సంధించుకుంటున్నాయి. ఈ క్రమంలో ఆప్ సర్కారు, కేజ్రీవాల్ లక్ష్యంగా బీజేపీ చార్జిషీట్ విడుదల చేసింది. కేజ్రీవాల్ అవినీతి కాలుష్యం నుంచి ఢిల్లీని రక్షించాలని ఓటర్లను కోరింది. గతంలో అన్నా హజారేను ముందుపెట్టి కాంగ్రెస్ అవినీతికి వ్యతిరేకంగా ఉద్యమాలు నడిపిన కేజ్రీవాల్.. నేడు అవినీతికి కొత్త ప్రమాణాలను తీసుకొచ్చారంటూ…

