2025 యాషెస్ తొలి టెస్ట్లో ఆస్ట్రేలియా సంచలన విజయం: రెండు రోజుల్లోనే మ్యాచ్ ఖతం!
2025 యాషెస్ సిరీస్ను ఆస్ట్రేలియా ఘనంగా ప్రారంభించింది. పెర్త్ వేదికగా ఇంగ్లండ్తో జరిగిన తొలి టెస్ట్ మ్యాచ్లో ఆస్ట్రేలియా 8 వికెట్ల తేడాతో సంచలన విజయం నమోదు చేసింది. ఈ టెస్ట్ మ్యాచ్ కేవలం రెండు రోజుల్లోనే ముగియడం విశేషం. తొలి రోజు ఏకంగా 19 వికెట్లు కూలగా, రెండో రోజు ఇంగ్లండ్ కేవలం 164 రన్స్కే రెండో ఇన్నింగ్స్లో ఆలౌట్ అయ్యింది. 205 పరుగుల విజయ లక్ష్యాన్ని ఛేదించడానికి రెండో ఇన్నింగ్స్ ఆడిన ఆస్ట్రేలియా కేవలం…

