చేపాక్ వేదికపై సీఎస్కే వర్సెస్ ఆర్ఆర్ మ్యాచ్ నేడే, ఇరు జట్ల ప్లేయింగ్ 11 అంచనాలు ఇవే
చెన్నై సూపర్కింగ్స్ చేపాక్ స్డేడియంలో రాజస్థాన్ రాయల్స్ జట్టుతో ఇవాళ తలపడనుంది. ఐపీఎల్ 2023 సీజన్లో ఎంఎం ధోని నేతృత్వంలోని సీఎస్కే వరుస విజయాలు సాధించినా..కొన్ని గాయాలు మాత్రం ఆ జట్టుని వెన్నాడుతున్నాయి. పేసర్ దీపక్ చాహర్ , ఆల్రౌండర్ బెన్ స్టోక్స్ ఇవాళ్టి మ్యాచ్లో సీఎస్కేకు అందుబాటులో లేకపోవడం గమనార్హం. ఈ ఇద్దరు ఆటగాళ్లు గాయాల కారణంగా ఇవాళ్టి మ్యాచ్కు దూరమయ్యారు. నాలుగు సార్లు టైటిల్ గెల్చుకున్న సీఎస్కే తరపున ఆడేందుకు ఇద్దరు శ్రీలంక ఆటగాళ్లు…