ఆకాశంలో అద్భుతం.. సెప్టెంబర్ 7న ‘బ్లడ్ మూన్’.. హైదరాబాద్ నుంచీ వీక్షించే అవకాశం..
ఖగోళ అద్భుతాల కోసం ఎదురుచూసేవారికి ఇది ఒక శుభవార్త. వచ్చే నెలలో ఆకాశంలో ఒక అరుదైన, కనువిందు చేసే దృశ్యం ఆవిష్కృతం కానుంది. సెప్టెంబర్ 7-8 తేదీల రాత్రి సంపూర్ణ చంద్రగ్రహణం ఏర్పడనుంది. ఈ గ్రహణం సమయంలో చంద్రుడు సాధారణం కంటే భిన్నంగా, ఎర్రటి నారింజ రంగులో ప్రకాశిస్తూ కనిపిస్తాడు. అందుకే దీనిని ‘బ్లడ్ మూన్’ లేదా రక్త చంద్రగ్రహణం అని పిలుస్తారు. దాదాపు 82 నిమిషాల పాటు ఈ అద్భుత దృశ్యాన్ని వీక్షించే అవకాశం కలగనుంది.…