ఫోన్ ట్యాపింగ్… కేసీఆర్ అభ్యర్థనకు అంగీకరించిన సిట్..!
తెలంగాణలో మున్సిపల్ ఎన్నికల దృష్ట్యా తాను విచారణకు హాజరు కాలేనన్న మాజీ ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అభ్యర్థనకు ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) అంగీకరించింది. ఫోన్ ట్యాపింగ్ కేసులో విచారణ కోసం కేసీఆర్‌కు మరింత సమయం ఇవ్వాలని నిర్ణయించింది. అయితే కేసీఆర్ లేవనెత్తిన పలు అంశాలపై సిట్ న్యాయ సలహా తీసుకోనుంది. న్యాయ నిపుణుల సలహా తీసుకున్న అనంతరం తదుపరి తేదీ, విచారణ చేసే ప్రాంతాన్ని పేర్కొంటూ సిట్ మరోసారి నోటీసులు జారీ చేయనుంది.…

