తెలంగాణలో 77 మంది డీఎస్పీల బదిలీలు.!
రాష్ట్ర పోలీసు యంత్రాంగంలో సోమవారం భారీ మార్పులు చోటుచేసుకున్నాయి. డీజీపీ జితేందర్ కీలక ఉత్తర్వులు జారీ చేస్తూ రాష్ట్రవ్యాప్తంగా 77 మంది డీఎస్పీ, ఏసీపీ స్థాయి అధికారులను బదిలీ చేశారు. ఈ బదిలీల ప్రక్రియలో భాగంగా కొందరికి నూతన పోస్టింగులు కేటాయించగా, మరికొందరిని డీజీపీ కార్యాలయంలో రిపోర్ట్ చేయాల్సిందిగా ఆదేశించారు. పోలీసు శాఖలో పరిపాలనా సౌలభ్యం కోసం చేపట్టిన ఈ బదిలీల్లో పలువురు కీలక అధికారులకు కొత్త బాధ్యతలు అప్పగించారు. జగిత్యాల సబ్-డివిజనల్ పోలీస్ ఆఫీసర్…