అదానీకి సీఎం రేవంత్ రెడ్డి రివర్స్ పంచ్.. ఆ రూ.100 కోట్లు వద్దే వద్దంటూ ప్రకటన..
ప్రస్తుతం వివాదాస్పదంగా మారిన అదానీ గ్రూప్ ఆఫ్ కంపెనీకి తెలంగాణ సర్కార్ భారీ షాకిచ్చింది. యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీకి అదాని గ్రూప్ ప్రకటించిన రూ. 100 కోట్ల విరాళాన్ని వెనక్కి పంపినట్లు సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. సీఎం రేవంత్ రెడ్డి మీడియా సమావేశంలో మాట్లాడుతూ… కొన్ని రోజులుగా అదానీ అంశంపై రాజకీయ దుమారం రేగుతుందని, అదానీ గ్రూప్ వివాదానికి తెలంగాణకు ఎటువంటి సంబంధం లేదన్నారు. తెలంగాణలో నైపుణ్యతను పెంచేందుకు ఏర్పాటు చేస్తున్న స్కిల్…