ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో హరీశ్ రావు భేటీ…
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో బీఆర్ఎస్ సీనియర్ ఎమ్మెల్యే హరీశ్ రావు సమావేశమయ్యారు. మాజీ మంత్రి పద్మారావు గౌడ్‌తో కలిసి ఆయన అసెంబ్లీలోని ముఖ్యమంత్రి కార్యాలయానికి వెళ్లారు. దాదాపు పావుగంట పాటు ముఖ్యమంత్రితో మాట్లాడారు. వీరిద్దరి భేటీ రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకుంది. అందుకే కలిశాం: హరీశ్ రావు సికింద్రాబాద్‌లో నెలకొన్న సమస్యలపై చర్చించేందుకే ముఖ్యమంత్రిని కలిసినట్లు హరీశ్ రావు తెలిపారు. ముఖ్యమంత్రితో భేటీ అనంతరం ఆయన మాట్లాడుతూ, సీతాఫల్‌మండిలో పెండింగులో ఉన్న ఎస్డీఎఫ్ నిధుల…