హరీశ్ రావు సిట్ విచారణ పూర్తి: 7 గంటల పాటు కొనసాగిన ప్రశ్నల వర్షం
తెలంగాణ రాజకీయాల్లో పెను సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ కేసులో బీఆర్ఎస్ కీలక నేత, మాజీ మంత్రి హరీశ్ రావు విచారణ మంగళవారం ముగిసింది. జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్‌లో సిట్ (SIT) అధికారులు ఆయనను సుమారు 7 గంటల పాటు సుదీర్ఘంగా విచారించారు. సోమవారం రాత్రే నోటీసులు అందుకున్న హరీశ్ రావు, మంగళవారం ఉదయం 11 గంటలకు అధికారుల ఎదుట హాజరయ్యారు. ఆరుగురు సభ్యులతో కూడిన ప్రత్యేక బృందం ఈ విచారణలో పాల్గొని, ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో…

