తెలంగాణలో గ్రూప్ -1 ఫలితాల విడుదలకు సుప్రీంకోర్టు గ్రీన్ సిగ్నల్..
తెలంగాణలో గ్రూప్ -1 ఫలితాల విడుదలకు సుప్రీంకోర్టు పచ్చజెండా ఊపింది. గ్రూప్ -1 పై దాఖలైన రెండు పిటిషన్లను సుప్రీంకోర్టు కొట్టివేసింది. తెలంగాణలో గ్రూపు – 1 మెయిన్స్ పరీక్షలు గత ఏడాది అక్టోబర్ 21 నుంచి 27 వరకు జరిగిన విషయం తెలిసిందే. మొత్తం 563 పోస్టులకు గాను 31,403 (క్రీడల కోటా కలిపి) మంది అభ్యర్థులు మెయిన్స్ పరీక్షలకు అర్హత సాధించారు. అయితే, జీవో నెం.29ని రద్దు చేయాలని, గ్రూప్ -1 మెయిన్స్…