ఐఏఎస్ ఆమ్రపాలికి తెలంగాణ హైకోర్టులో ఎదురుదెబ్బ: ‘క్యాట్’ తీర్పుపై స్టే
ఐఏఎస్ అధికారిణి ఆమ్రపాలికి కేడర్ కేటాయింపు విషయంలో తెలంగాణ హైకోర్టులో తాత్కాలికంగా చుక్కెదురైంది. గతంలో ఆమెకు అనుకూలంగా కేంద్ర పరిపాలనా ట్రిబ్యునల్ (CAT) ఇచ్చిన ఆదేశాలపై హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేస్తూ స్టే విధించింది. కేసు నేపథ్యం, వివాదం: గత ఏడాది అక్టోబర్‌లో డీఓపీటీ (DoPT) ఆమ్రపాలిని ఆంధ్రప్రదేశ్ కేడర్‌కు కేటాయించింది. దీనిని ఆమె క్యాట్‌లో సవాల్ చేయగా, క్యాట్ ఆమెకు అనుకూలంగా తీర్పునిచ్చింది. ఈ తీర్పు ఆధారంగా, ఐఏఎస్ హరికిరణ్‌తో స్వాపింగ్ (మార్పిడి) పద్ధతి…

