మేడారం జాతరకు ఆర్టీసీ గుడ్‌న్యూస్: ప్రత్యేక బస్సులు, నవంబర్ నుంచే సేవలు
తెలంగాణ రాష్ట్రంలోని ములుగు జిల్లాలో ప్రతి రెండేళ్లకోసారి జరిగే ఆసియాలోనే అతిపెద్ద గిరిజన జాతర అయిన మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర కోసం ఆర్టీసీ (TSRTC) ఇప్పుడే సన్నద్ధమవుతోంది. 2026 జనవరి 28 నుంచి 31వ తేదీ వరకు ఈ జాతర జరగనుంది. తెలంగాణ కుంభమేళాగా పేరుగాంచిన ఈ జాతరకు తెలంగాణతో పాటు ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర, ఛత్తీస్‌గఢ్, ఒడిశా వంటి దేశ నలుమూలల నుంచి లక్షలాది మంది భక్తులు తరలివస్తారు. ఈ భారీ రద్దీని దృష్టిలో ఉంచుకుని, వనదేవతలను…

