స్థానిక సంస్థల ఎన్నికలు: బీఆర్ఎస్‌కు ‘బావ-బామ్మర్దుల’ సారథ్యం సవాలేనా?
తెలంగాణలో త్వరలో జరగనున్న స్థానిక సంస్థల ఎన్నికలు భారత్ రాష్ట్ర సమితి (బీఆర్ఎస్)కి ఒక పెద్ద సవాల్‌గా మారనున్నాయి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వ్యూహాలకు ధీటుగా బలంగా వెళ్లాలంటే, ప్రస్తుతం పార్టీ సారథ్యం వహిస్తున్న కేటీఆర్ నాయకత్వం సరిపోదన్న అభిప్రాయం పార్టీలో బలంగా వినిపిస్తోంది. అనారోగ్య కారణాల వల్ల మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఇప్పటికీ ఫామ్‌హౌస్‌కే పరిమితం కావడం, ఆయన ఎన్నికల ప్రచారానికి కూడా దూరంగా ఉండే అవకాశాలు ఉండటంతో, ఈ కీలకమైన స్థానిక ఎన్నికలను కూడా…

