గిరిజనులకు ఇందిరమ్మ ఇళ్లు..! బెండాలపాడులో చారిత్రక ఘట్టం..! ప్రారంభించనున్న సీఎం రేవంత్..
ఏళ్ల తరబడి గుడిసెల్లోనే గడిపిన గిరిజనుల జీవితాల్లో కొత్త వెలుగులు నిండనున్నాయి. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని మారుమూల ఏజెన్సీ గ్రామమైన బెండాలపాడు రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన ఇందిరమ్మ ఇళ్ల పథకానికి వేదిక కానుంది . ఈ పథకం కింద నిర్మించిన ఇళ్ల గృహప్రవేశ మహోత్సవం బుధవారం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేతుల మీదుగా జరగనుంది. సీఎం రేవంత్ రెడ్డి మధ్యాహ్నం 2:20 గంటలకు హెలికాప్టర్‌లో బెండాలపాడుకు చేరుకుంటారు. గ్రామంలోని లబ్ధిదారులైన బచ్చల నర్సమ్మ, బచ్చల…

