బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి అరెస్ట్..
తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. హుజూరాబాద్ నియోజకవర్గానికి చెందిన బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్‌రెడ్డిని పోలీసులు అరెస్టు చేశారు. ఒక క్వారీ యజమానిని బెదిరించారన్న ఆరోపణలపై ఆయనపై ఈ చర్యలు తీసుకున్నారు. వివరాల్లోకి వెళితే… కౌశిక్ రెడ్డిపై క్వారీ యజమానిని బెదిరించినట్లుగా ఆరోపణలు రావడంతో వరంగల్ సుబేదారి పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ క్రమంలో శనివారం ఆయనను శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయంలో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అరెస్టు అనంతరం తదుపరి…

