తెలంగాణలో రిటైర్డ్ ఐఏఎస్, ఐపీఎస్ లకు కీలక పదవులు..!
తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలోని సర్కారు పలువురు రిటైర్డ్ ఐఏఎస్, ఐపీఎస్ లను కీలక పదవుల్లో నియమించింది. ఈ క్రమంలోనే టీటీడీ జేఈవోగా సేవలందించిన మాజీ ఐఏఎస్ అధికారి కె.ఎస్. శ్రీనివాసరాజును ముఖ్యమంత్రి కార్యాలయ ముఖ్య కార్యదర్శిగా నియమించింది. ఆయన ఈ బాధ్యతను రెండు సంవత్సరాల పాటు నిర్వర్తించనున్నారు. ఆంధ్రప్రదేశ్ క్యాడర్‌కు చెందిన శ్రీనివాసరాజు గతంలో సుదీర్ఘ కాలం పాటు తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) జేఈవోగా బాధ్యతలు నిర్వహించారు.…

