ఫోన్ ట్యాపింగ్ కేసులో విస్తుగొలిపే విషయాలు..18 మంది హైకోర్టు జడ్జిలపై నిఘా..
ఫోన్ ట్యాపింగ్ కేసు విచారణలో విస్తుగొలిపే విషయాలు వెలుగు చూస్తున్నాయి. గత ప్రభుత్వ హయాంలో తెలంగాణ హైకోర్టులో పని చేసిన 18 మంది న్యాయమూర్తుల డీటైల్స్.. ఈ కేసుకు సంబంధించిన నిందితుడి కంప్యూటర్‌లో ఉన్నట్టు తేలింది. అందులో ఐదుగురు మహిళా న్యాయమూర్తుల సమాచారమూ ఉంది. ఫోన్ ట్యాపింగ్‌పై తెలంగాణ స్పెషల్ ఇంటెలిజెన్స్ బ్రాంచ్ ఎస్ఐబీ మాజీ ఓఎస్డీ ప్రభాకర్‌రావు టీంపై ఇదివరకే కేసు నమోదైంది. హైదరాబాద్ పోలీసులు నమోదు చేసిన ఈ కేసులో నిందితుల నుంచి…

