ఒక బ్యారేజీలో రెండు చోట్ల పగుళ్లు కనిపిస్తే, ఏదో పెను ప్రమాదం జరిగిపోయినట్లుగా చెబుతున్నారు..-: కేటీఆర్
కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించిన వాస్తవాలు నిలకడగా వెలుగులోకి వస్తాయని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, సిరిసిల్ల ఎమ్మెల్యే కేటీ రామారావు పేర్కొన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం కమీషన్ల వ్యవహారం నుంచి ప్రజల దృష్టిని మరల్చేందుకే కాళేశ్వరంపై అనవసర రాద్ధాంతం చేస్తోందని ఆయన ఆరోపించారు. హైదరాబాద్‌లో ఆయన మీడియాతో మాట్లాడుతూ, ఒక బ్యారేజీలో రెండు చోట్ల పగుళ్లు కనిపిస్తే, ఏదో పెను ప్రమాదం జరిగిపోయినట్లుగా చిత్రీకరిస్తున్నారని విమర్శించారు. ఘోష్ కమిటీ విచారణ పూర్తయిందని ప్రకటించిన ప్రభుత్వం, ఇప్పుడు కొత్తగా నోటీసులు…

