తెలంగాణలో ఆపిల్ ఎయిర్ పాడ్ల తయారీ..!
ఆపిల్ ఐఫోన్ తయారీదారు ఫాక్స్‌కాన్ హైదరాబాద్ సమీపంలో ఎయిర్‌పాడ్‌ల ఉత్పత్తిని ప్రారంభించనుంది. 2025 నుంచి ఉత్పత్తిని ప్రారంభించనున్నారు. ఫాక్స్‌కాన్ చైనా వెలుపల ప్లాంట్లు ఏర్పాటు చేయాలని నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా భారత్ లో ఉత్పత్తిని ప్రారంభించనుంది. తెలంగాణలోని తయారీ కేంద్రంలో 2025 మొదటి త్రైమాసికంలో ఉత్పత్తి అందుబాటులోకి తీసుకురానున్నారు. ఇప్పటికే ట్రయల్ తయారీని ప్రారంభించిందని పలు నివేదికలు వస్తున్నాయి. ఈ అభివృద్ధి భారతదేశంలో ఐఫోన్‌లను అసెంబ్లింగ్ చేయడంలో కీలకం కానుంది. యాపిల్…

