ఫోన్ ట్యాపింగ్ కేసు.. రాధాకిషన్ రావుకు ఏడు రోజుల కస్టడీ..
తెలంగాణలో సంచలనం సృష్టిస్తున్న ఫోన్ ట్యాపింగ్ కేసులో విచారణ వేగవంతంగా నడుస్తోంది. ఈకేసులో ఏ4గా ఉన్న రాధాకిషన్ రావు(Radhakishan rao) కస్టడీ కోరుతూ.. పోలీసులు వేసిన పిటిషన్‌పై బుధవారం నాంపల్లి కోర్టు విచారించింది. రాధాకిషన్‌రావుకు 7 రోజుల పోలీసు కస్టడీకి అనుమతినిస్తూ ఆదేశాలు జారీ చేసింది. గురువారం నుంచి 7 రోజుల పాటు రాధాకిషన్‌రావును పోలీసులు ప్రశ్నించనున్నారు. కాగా, ఫోన్ ట్యాపింగ్ కేసులో ప్రణీత్ రావు, భుజంగరావు, తిరుపతన్న, రాధాకిషన్ రావును నిందితులుగా చేర్చిన విషయం…

