TELANGANA

TELANGANA

రేపు పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో కేసీఆర్ సమావేశం..

బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ ఎల్లుండి పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో సమావేశం కానున్నారు. ఈ నెల 8వ తేదీన మధ్యాహ్నం 1 గంటలకు బీఆర్ఎస్ ప్రజాప్రతినిధులతో ఆయన సమావేశమవుతారు. ఎర్రవెల్లిలోని వ్యవసాయ క్షేత్రంలో ఈ సమావేశం జరగనుంది. ఈ మేరకు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ వెల్లడించారు.   ఏం విగ్రహమంటూ కేటీఆర్ ఆగ్రహం   సచివాలయంలో ఏర్పాటు చేస్తోంది తెలంగాణ తల్లి విగ్రహమా? లేక కాంగ్రెస్ తల్లి విగ్రహమా? అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్…

TELANGANA

తెలంగాణ తల్లికి కొత్త రూపం.. విగ్రహం ప్రత్యేకతలు ఇవే, ఈ నెల 9న ఆవిష్కరణ..

పచ్చచీర గట్టి, కంకి చేతబట్టి అభయహస్తంబు చూబుతూ పిడికిలి గురుతులున్న పాదపీఠంబెక్కి నిండు ముత్తయిదువోలె కనులపండువలా కనిపిస్తోంది తల్లీ తెలంగాణ. తల్లీ నీకివే మా పాదాభివందనాలంటూ.. అందరూ చేతులెత్తి మొక్కేలా ఉంది తెలంగాణ తల్లి విగ్రహం. సరికొత్త తెలంగాణ తల్లి విగ్రహావిష్కరణకు సర్వం సిద్ధం చేస్తోంది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం.   తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా ఏర్పాటు చేస్తున్న తెలంగాణ తల్లి విగ్రహ నమూనాను ప్రభుత్వం విడుదల చేసింది. సచివాలయంలో ఏర్పాటు చేస్తున్న తెలంగాణ…

TELANGANA

కోటి మంది మహిళాలను కోటీశ్వరులను చేస్తా.. సీఎం రేవంత్ రెడ్డి..

మహిళా సంక్షేమానికి తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం అధిక ప్రాధాన్యతనిచ్చి ఎన్నో పథకాలను ప్రవేశపెట్టిందని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. హైదరాబాద్ లోని మాదాపూర్ లో గల శిల్పారామంలో నూతనంగా ఏర్పాటుచేసిన రాష్ట్రస్థాయి మహిళా శక్తి బజార్ ను సీఎం రేవంత్ రెడ్డి గురువారం సాయంత్రం ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో గవర్నర్ జిష్ణు దేవ్ వర్మ, డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క, మంత్రి సీతక్క, ఇతర మంత్రులు అధికారులు పాల్గొన్నారు.   ఇందిరా మహిళా శక్తి బజారు…

TELANGANA

ఇందిరమ్మ ఇళ్ల యాప్‌ ఆవిష్కరించిన సీఎం రేవంత్‌….

బీఆర్ఎస్‌ను ప్రజలు దూరం పెట్టినా ఆ పార్టీలో ఎలాంటి మార్పు రాలేదన్నారు సీఎం రేవంత్ రెడ్డి. మా ప్రభుత్వానికి అభివృద్ధి, సంక్షేమం రెండు కళ్లున్నారు. సభలో పాలకపక్షం- విపక్షం సమస్యలపై చర్చించాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. విపక్ష నేత సభకు రావడం లేదన్నారు.   సభకు వచ్చి పాలక పక్షాన్ని ఇరుకున పెట్టాలన్నారు సీఎం. మీ అనుభవాన్ని ప్రజల కోసం ఉపయోగించాలని సూచన చేశారు. ప్రభుత్వాన్ని అడ్డుకోవడమే పనిగా పెట్టుకున్నారా? అంటూ సున్నితంగా ప్రశ్నించారు. మీ పిల్లలిద్దర్నీ…

TELANGANA

ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి పై కేసు నమోదు చేసిన పోలీసులు..

హుజూరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డిపై హైదరాబాద్ వెస్ట్ జోన్ పోలీసులు కేసు నమోదు చేశారు. ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి బుధవారం బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ కు వెళ్లి హల్చల్ చేసిన విషయం తెలిసిందే. ప్రతిపక్ష నాయకుల ఫోన్లను ట్యాపింగ్ చేస్తున్నారంటూ.. ఫిర్యాదు చేసేందుకు ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ కు వెళ్లారు. ఈ సందర్భంగా అక్కడ విధుల్లో గల సీఐకు కౌశిక్ రెడ్డికి మధ్య వాగ్వివాదం సాగింది. తాను ప్రస్తుతం ఇతర…

TELANGANA

నేడే ఇందిరమ్మ ఇళ్ల యాప్ ఆవిష్కరణ.. కీలక ప్రకటన చేయనున్న సీఎం రేవంత్ రెడ్డి..

సచివాలయంలో ప్రజాపాలన విజయోత్సవాల ముగింపు వేడుకల నిర్వహణ ఏర్పాట్లపై సీఎస్ శాంతికుమారి సమీక్ష నిర్వహించారు. విజయోత్సవాల్లో భాగంగా సినీ రంగ ప్రముఖులతో మ్యూజికల్ నైట్, నగరంలోని ప్రముఖ హోటళ్లు, డ్వాక్రా, రెస్టారెంట్లు, సంస్థలచే స్టాళ్ళ ఏర్పాటు, భారీ ఎత్తున డ్రోన్ షో, లేజర్ షో, క్రాకర్స్ షో జరగనున్నాయి. వీటన్నింటిపై రివ్యూ చేశారు సీఎస్. 7 వ తేదీన వందేమాతరం శ్రీనివాస్ బృందం, 8న రాహుల్ సిప్లిగంజ్, 9న థమన్‌తో సినీ సాంస్కృతిక కార్యక్రమాలు ఉంటాయి. అదే…

TELANGANA

కవితకు కేసీఆర్ సంకేతాలు..? రంగంలోకి కవిత..?

బీఆర్ఎస్‌లో కలహాలు తారాస్థాయికి చేరాయా? హరీష్‌రావుపై కేసు నమోదు కావడంతో పార్టీ పగ్గాలు చేపట్టేందుకు కవితకు రూట్ క్లియర్ అయ్యిందా? లీడర్ షిప్ కోసం ఫ్యామిలీలో జరిగిన చర్చ ఏంటి? కేటీఆర్ తర్వాత కవిత తెరపైకి రావడానికి కారణాలేంటి? ఇవే ప్రశ్నలు చాలామందిని వెంటాడుతున్నాయి.   బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ తర్వాత ఆ పార్టీ పగ్గాలు ఎవరు తీసుకుంటున్నారు? తొలుత కేటీఆర్‌కే పగ్గాలు అందుకుంటారని నేతలు భావించారు. ఈలోగా కవిత తెరపైకి రావడానికి కారణాలేంటి? అధినేత ఆలోచన…

TELANGANA

ఆ నీటిలో మాకు అధిక వాటాను ఇవ్వాలి: కేంద్రానికి తెలంగాణ విజ్ఞప్తి..

గోదావరి-కావేరీ నదుల అనుసంధానంతో తెలంగాణ అధిక భూభాగాన్ని కోల్పోతోందని, కాబట్టి తమకు నీటి వాటాలో ఎక్కువ ఇవ్వాలని తెలంగాణ నీటి పారుదల శాఖ అధికారులు విజ్ఞప్తి చేశారు. జాతీయ జల అభివృద్ధి సంస్థ 74వ పాలకమండలి సమావేశం కేంద్ర జలవనరుల శాఖ కార్యదర్శి దేబశ్రీ ముఖర్జీ అధ్యక్షతన ఈరోజు జరిగింది.   ఈ సమావేశానికి తెలంగాణ నుంచి నీటిపారుదల శాఖ ఇంజినీర్ ఇన్ చీఫ్ అనిల్ కుమార్, ఇంజినీర్లు వర్చువల్ సమావేశంలో పాల్గొన్నారు. ఈ ప్రాజెక్టును తెలంగాణ…

TELANGANA

సిద్దిపేట్‌కు సీఎం రేవంత్.. కోకాకోలా గ్రీన్ ప్లాంట్ ప్రారంభం..

ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి సోమవారం సిద్ధిపేట్‌కి వెళ్తున్నారు. సిద్దిపేట జిల్లాలో హెచ్‌సీసీబీ ఏర్పాటు చేసిన కోకా కోలా ఫ్యాక్టరీని ప్రారంభించనున్నారు. అందుకు సంబంధించి ఏర్పాట్లు చకచకా జరుగుతున్నాయి.   శీతల పానీయాలను ఉత్పత్తి చేసే హిందుస్థాన్ బివరేజెస్ సంస్థ సిద్ధిపేట్ జిల్లాలో భారీ ప్లాంట్ ఏర్పాటు చేసింది. బండ తిమ్మాపూర్ ఫుడ్ పార్కులో నిర్మించిన భారీ బాట్లింగ్ యూనిట్‌ను సిఎం రేవంత్ రెడ్డి సోమవారం ప్రారంభించనున్నారు.   దాదాపు రూ.1,200 కోట్ల వ్యయంతో చేపట్టిన గ్రీన్ ఫీల్డ్ బాట్లింగ్…

TELANGANA

మళ్ళీ ఎమ్మెల్సీ ఎన్నికల రేసులో జీవన్ రెడ్డి..? రేవంత్ నిర్ణయం ఏంటి..?

పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల హాడవుడి కాంగ్రెస్‌లో మొదలైంది. ఆశావాహుల సంఖ్య కూడ రోజురోజుకి పెరుగుతుంది. సిట్టింగ్ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి తన‌ మనసులోని మాట బయటకి చెప్పారు. అధిష్టానం అదేశిస్తే పొటికి సై అంటున్నారు. ఇప్పటికే కాంగ్రెస్ అధిష్టానం ఎమ్మెల్సీ ఎన్నికలపైనా ఫోకస్ పెట్టిన నేపధ్యంలో అభ్యర్థుల ఎంపికపై వాడివేడి చర్చ జరుగుతుంది.   ఉత్తర తెలంగాణలో కీలకమైన పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలు మార్చి మొదటివారంలో జరిగే అవకాశం ఉంది. పార్లమెంటు ఎన్నికల తరువాత ఇది ముఖ్యమైన…