TELANGANA

TELANGANA

ఎలివేటెడ్ కారిడార్‌కు సీఎం రేవంత్ భూమి పూజ ..

కేంద్రంలో ఎవరున్నా తెలంగాణ అభివృద్ధి కోసం సహకరించాలని అడుగుతూనే ఉంటామని, సహకరించకపోతే ప్రజలిచ్చిన శక్తితో కొట్లాడుతామని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్పారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మధ్య ఘర్షణ వైఖరి అభివృద్ధిని కుంటుపరుస్తుందన్నారు. ఉత్తర తెలంగాణ అభివృద్ధికి కీలకమైన రాజీవ్‌ రహదారి ఎలివేటెడ్‌ కారిడార్‌కు ముఖ్యమంత్రి గురువారం భూమి పూజ చేశారు.   ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మాట్లాడుతూ.. రాజీవ్ రహదారి ఎలివేటేడ్ కారిడార్ పూర్తయితే మేడ్చల్, కుత్బుల్లాపూర్ అభివృద్ధి చెందడమే కాకుండా..…

TELANGANA

‘రైతు నేస్తం’ ప్రారంభించిన సీఎం రేవంత్

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బుధవారం ‘రైతు నేస్తం’ కార్యక్రమాన్ని ప్రారంభించారు. రాష్ట్రవ్యాప్తంగా 110 రైతు వేదికల్లో వీడియో కాన్ఫరెన్స్ద్వారా ముఖ్యమంత్రి ప్రారంభోత్సవం చేశారు. ఈ కార్యక్రమంలో ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు మాట్లాడారు.   రైతులను అన్ని రకాలుగా ఆదుకుంటామని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు హామీ ఇచ్చారు. రైతులు సాంకేతికత అందిపుచ్చుకునేలా ప్రోత్సహిస్తామని తెలిపారు. రైతులకు మేలు చేసేలా తమ ప్రభుత్వం…

TELANGANA

మేడారం జాతర హుండీ లెక్కింపు పూర్తి..

మేడారం (Medaram) సమ్మక్క-సారక్క మహా జాతర హుండీ లెక్కింపు ప్రక్రియ పూర్తయింది. మొత్తం 540 హుండీలను లెక్కించగా.. రూ. 13.25 కోట్ల ఆదాయం సమకూరింది. 779 గ్రాముల బంగారం, 55 కిలోల వెండిని అమ్మవార్లకు భక్తులు కానుకలుగా సమర్పించుకున్నారు.   హనుమకొండలోని టీటీడీ కళ్యాణ మండపంలో ఫిబ్రవరి 29 నుంచి హుండీలను లెక్కించారు. మేడారం జాతరకు కోట్లాది మంది భక్తులు తరలివచ్చి వనదేవతలు సమ్మక్క-సారక్కలను దర్శించుకున్న విషయం తెలిసిందే. కాగా, 2022 మేడారం జాతర కంటే ఈ…

TELANGANA

కేసీఆర్ తో ఆర్ఎస్పీ భేటీ.. పొత్తు కోసమేనా..!..

బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ను మంగళవారం మర్యాదపూర్వకంగా కలిశారు. హైదరాబాద్ బంజారహిల్స్ నందినగర్ లోని కేసీఆర్ నివాసానికి వెళ్లిన ఆర్ఎస్పీ కేసీఆర్ తో భేటీ అయ్యారు. వీరి సమావేశం చాలా సేపు జరిగినట్లు తెలుస్తోంది. భేటీలో మాజీ మంత్రి హరీశ్ రావు, వేముల ప్రశాంత్, బాల్క సుమన్ తో పాటు బీఎస్పీ నేతలతో ఉన్నారు. లోక్ సభ ఎన్నికల నేపథ్యంలో ఈ సమావేశం ప్రాధాన్యత సంతరించుకుంది.   ఆర్ఎస్పీ,…

TELANGANA

తెలంగాణ నుంచి లోక్‌సభకు రాహుల్..

లోక్‌సభ ఎన్నికల షెడ్యూల్ విడుదల గడువు సమీపించిన నేపథ్యంలో అధికార కాంగ్రెస్ పార్టీ దూకుడు ప్రదర్శిస్తోంది. మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో సాధించిన విజయాన్ని ఇక్కడా పునరావృతం చేయాలనే పట్టుదలతో ఉంది. దీనికి అనుగుణంగా వ్యూహాలను రూపొందించుకుంటోంది.   తెలంగాణలో మొత్తం 17 లోక్‌సభ స్థానాలు ఉండగా.. అత్యధికం బీఆర్ఎస్ ఖాతాలో ఉన్నాయి. తొమ్మిది స్థానాల్లో గులాబీ జెండా ఎగురుతోంది. నాలుగు చోట్ల బీజేపీ అభ్యర్థులు విజయం సాధించారు. మరో మూడింటిని కాంగ్రెస్ పార్టీ గెలుచుకుంది. ఏఐఎంఐఎం ఒక…

TELANGANA

కాళేశ్వరం, బీఆర్ఎస్ – కాంగ్రెస్ పై పీఎం మోదీ కీలక వ్యాఖ్యలు..!

రాష్ట్రంలో బీఆర్‌ఎస్‌ పోయి, కాంగ్రెస్‌ వచ్చినా పాలనలో మార్పు లేదని ప్రధాని మోదీ మండిపడ్డారు. బీఆర్‌ఎస్‌, కాంగ్రెస్‌లు రెండూ ఒకటేనని ఆరోపించారు. దోచుకోవడం, అబద్ధాలు చెప్పడం జూట్‌, లూఠ్‌ రెండే కుటుంబ పార్టీలకు తెలుసని విమర్శించారు. కాళేశ్వరం ప్రాజెక్టు విషయంలో బీఆర్‌ఎస్‌తో కాంగ్రెస్‌ ప్రభుత్వం కుమ్మక్కవుతోందని కీలక వ్యాఖ్యలు చేసారు. దేశంలో త్వరలో 7 మెగా టెక్స్‌టైల్స్‌ పార్కులు ఏర్పాటు చేయబోతున్నామని ప్రధాని చెప్పుకొచ్చారు.   కుమ్మక్కయ్యారు: కాళేశ్వరం ప్రాజెక్టు విషయంలో బీఆర్‌ఎస్‌తో కాంగ్రెస్‌ ప్రభుత్వం కుమ్మక్కవుతోందని…

TELANGANA

కవిత సహా నలుగురితో బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థుల తొలి జాబితా..

పార్లమెంట్ ఎన్నికలు దగ్గరపడుతున్న క్రమంలో అన్ని రాజకీయ పార్టీలు అభ్యర్థుల ఎంపికపై దృష్టి సారించాయి. తాజాగా, సోమవారం లోక్‌సభ ఎన్నికల కార్యాచరణలో భాగంగా ఖమ్మం, మహబూబాబాద్ నియోజకవర్గాల నేతలతో బీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్ సమావేశమయ్యారు. తెలంగాణ భవన్‌లో జరిగిన సమావేశంలో పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, సీనియర్ నేత హరీశ్‌రావు, ఎంపీలు కేశవరావు, నామా నాగేశ్వర రావు, కవిత పాల్గొన్నారు. రెండు నియోజకవర్గాల పరిధిలోని ప్రజాప్రతినిధులు, మాజీలు, సీనియర్ నేతలతో కేసీఆర్ భేటీ అయ్యారు.   ఈ…

TELANGANA

హైదరాబాద్ సిటీకి మరో గౌరవం.. లక్క గాజులకు జీఐ ట్యాగ్..

నగరంలోని పాతబస్తీ లక్క గాజులకు భౌగోళిక గుర్తింపు (Geographical indication) లభించింది. ఈ మేరకు కేంద్ర వాణిజ్య, పరిశ్రమల మంత్రిత్వ శాఖ ఆధీనంలోని కంట్రోలర్జనరల్ఆఫ్ పేటెంట్స్, డిజైన్స్ అండ్ ట్రేడ్మార్క్స్గుర్తింపును మంజూరు చేసింది.ఇదివరకే హైదరాబాద్‌ హలీమ్‌కు(Hyderabad Haleem) జీఐ ట్యాగ్‌ దక్కగా, తాజాగా లక్క గాజులు ఆ జాబితాలో చేరడం విశేషం.   ప్రపంచ ప్రసిద్ధి గాంచిన చార్మినార్‌ లాడ్‌బజార్‌ లాక్‌ బేంగిల్స్‌ను తెలుగులో లక్క రాళ్ల గాజులుగా పిలుస్తుంటారు. తాజాగా, ఈ లక్క గాజులకు చెన్నైలోని…

TELANGANA

ఒంటిపూట బడులు, వేసవి సెలవుల పై ప్రభుత్వ నిర్ణయం..!!

తెలంగాణ ప్ర‌భుత్వం ఒంటిపూట బడులపై కీలక నిర్ణయం తీసుకుంది. క్రమంగా ఎండలు పెరుగుతున్న వేళ ఈ నిర్ణయం తీసుకుంది. మార్చి 15వ తేదీ నుంచి రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేట్, ఎయిడెడ్‌ స్కూళ్లకు ఒంటి పూట బడులు నిర్వహించ‌నున్నట్లు ప్రకటించింది. ఈ రోజుల్లో ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు ఒంటిపూట బడులు కొనసాగుతాయి. అయితే.. 10వ తరగతి పరీక్షలు జరిగే స్కూళ్లలో మాత్రం మధ్యాహ్నం క్లాసులు నిర్వహిస్తారు.   ఒంటిపూట బడులతో…

TELANGANA

అంగన్ వాడీలకు షాకిచ్చిన సీఎం రేవంత్..!

తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి అంగన్ వాడీలకు సంబంధించి కీలక నిర్ణయం తీసుకున్నారు. అంగన్ వాడీ కేంద్రాల్లో సీసీ కెమెరాల ఏర్పాటు తో పాటు బయోమెట్రిక్ హాజరు ఉండేలా చూసుకోవాలని అధికారులను ఆదేశించారు. శనివారం సీఎం రేవంత్ మహిళ, శిశు, దివ్యాంగులు, వృద్ధుల సంక్షేమంపై అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికిమంత్రి సీతక్క, సీఎస్ శాంతి కుమారి ఇతర అధికారులు హాజరయ్యారు.   అంగన్ వాడీల ద్వారా బాలింతలు, గర్భిణీలకు మంచి పౌష్టికాహారం అందించాలని సీఎం…