టీఎస్ఆర్టీసీలో కొత్త బస్సులు..
జంటనగరాల్లో కొత్తగా ఎలక్ట్రిక్ నాన్ ఏసీ సిటీ బస్సులు రోడ్లపై పరుగులు పెడుతోన్నాయి. పర్యావరణ హిత ఎలక్ట్రిక్ బస్సులను టీఎస్ఆర్టీసీ అధికారులు ప్రారంభించారు. దశలవారీగా ఎలక్ట్రిక్ సిటీ బస్సులను వినియోగంలోకి తీసుకుని రావడంలో భాగంగా వాటిని అందుబాటులోకి తీసుకుని వచ్చారు. హైదరాబాద్‌లో అన్నీ ఎలక్ట్రిక్ సిటీ బస్సులే నడిపేలా భవిష్యత్ కార్యాచరణ ప్రణాళికను రూపొందించుకుంది టీఎస్ఆర్టీసీ. ఇందులో భాగంగా దశలవారీగా వాటిని నడిపిస్తోంది. ఇదివరకు 150కి పైగా ఎలక్ట్రిక్ బస్సులను అందుబాటులోకి తీసుకొచ్చింది. ఇప్పుడు తాజాగా…

