పుంగ్-వాంగ్ సూపర్ టైఫూన్ బీభత్సం: ఫిలిప్పీన్స్‌లో 230 కి.మీ వేగంతో గాలులు, 10 లక్షల మంది తరలింపు
ఫిలిప్పీన్స్ దేశాన్ని ‘పుంగ్-వాంగ్’ అనే సూపర్ టైఫూన్ వణికిస్తోంది. ఈ అతి తీవ్ర తుపాను కారణంగా గంటకు గరిష్ఠంగా 230 కిలోమీటర్ల వేగంతో ప్రచండ గాలులు వీస్తున్నాయి. తుపాను దాటికి మెరుపు వరదలు, కొండచరియలు విరిగిపడటం వంటి ప్రమాదాలు పొంచి ఉండటంతో అధికారులు అత్యంత అప్రమత్తమయ్యారు. దేశంలో అత్యధిక జనాభా కలిగిన లూజాన్ ద్వీపంలోని అరోరా ప్రావిన్స్‌లో ఈ భయంకరమైన తుపాను తీరాన్ని తాకింది. ఈ తుపాను తీవ్రత సుమారు 18 వందల కిలోమీటర్ల మేర విస్తరించి…

