అమెరికన్ కంపెనీకి షాకిచ్చిన సుప్రీంకోర్టు
భారతదేశంలో ఒకప్పుడు అత్యధిక ప్రజాదరణ పొందిన అమెరికన్ బ్రాండ్ ‘ఫోర్డ్’ (Ford) ప్రస్తుతం ఇండియన్ మార్కెట్లో ఉత్పత్తికి సంబంధించిన కార్యకలాపాలను నిలిపివేసిన సంగతి తెలిసింది. అయితే తన కస్టమర్లకు సర్వీస్ వంటివి అందిస్తోంది. కాగా ఇటీవల ఈ సంస్థకు సుప్రీంకోర్టు ఏకంగా రూ. 42 లక్షల జరిమానా విధించింది. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం. నివేదికల ప్రకారం, ఒక కస్టమర్ డీలర్‌షిప్ నుంచి ‘ఫోర్డ్ ఎండీవర్’ 3.2 లీటర్ వెర్షన్‌ను కొనుగోలు చేసారు.…

