CINEMA

Waltair Veerayya 75 కోట్ల రూపాయల థియేటర్ బిజినెస్

మెగాస్టార్ చిరంజీవి నటించిన వాల్తేరు వీరయ్య మరియు నందమూరి బాలకృష్ణ నటించిన వీర సింహారెడ్డి సినిమా లు ఈ సంక్రాంతి కి ప్రేక్షకుల ముందుకు రాబోతున్న విషయం తెలిసిందే. మరో 10 రోజుల్లో విడుదల కాబోతున్నాయి. ఈ రెండు సినిమాల యొక్క ప్రీ రిలీజ్ బిజినెస్ దాదాపుగా పూర్తయింది. విశ్వసనీయంగా అందుతున్న సమాచారం ప్రకారం వాల్తేరు వీరయ్య సినిమా ను ఒకటి రెండు ఏరియాలు మినహా అన్ని ఏరియాలో కలిపి 75 కోట్ల రూపాయల థియేటర్ బిజినెస్ చేసినట్లుగా తెలుస్తోంది. ఇక వీర సింహారెడ్డి సినిమా 60 కోట్ల రూపాయల థియేట్రికల్‌ బిజినెస్ చేసిందని సమాచారం అందుతుంది. రెండు సినిమాలు కూడా మరికొన్ని ఏరియాలో ఇతర రాష్ట్రాల బిజినెస్ లెక్కలు తేలాల్సి ఉంది. మొత్తానికి రెండు సినిమాలు కూడా భారీ ఎత్తుగానే ఫ్రీ రిలీజ్ బిజినెస్ చేశాయి.

థియేట్రికల్‌ రైట్స్ తోనే ఈ స్థాయిలో దక్కించుకుంటే ఇక ఓటిటి ఇతర రైట్స్ ద్వారా మరింత లాభాలను నిర్మాతలు సొంతం చేసుకుని ఉంటారు. ఈ రెండు సినిమాలు కూడా 100 కోట్ల పైబడిన బడ్జెట్ తోనే రూపొందాయి. కనుక ఈ ప్రీ రిలీజ్ బిజినెస్ ఆ స్థాయిలోనే ఉంది, సినిమాలు రెండు మినిమం సక్సెస్ టాక్ దక్కించుకున్నా కూడా ఈజీగా 100 కోట్ల కలెక్షన్స్ నమోదు చేసే అవకాశం ఉందని ఇండస్ట్రీ వర్గాల వారు మాట్లాడుకుంటున్నారు. ఒక్క రోజు తేడాతో రాబోతున్న ఈ రెండు సంక్రాంతి సినిమాలకు పోటీగా విజయ్ నటించిన వారసుడు సినిమాను దిల్ రాజు విడుదల చేయబోతున్న విషయం తెలిసిందే.