CINEMA

నరేష్ నా కాళ్ళు పట్టుకున్నాడు: తన మూడో భార్య రమ్య రఘుపతి సంచలన వ్యాఖ్యలు

సీనియర్ నటుడు నరేష్, సీనియర్ నటి పవిత్ర లోకేష్.. వైవాహిక బంధంతో ఒక్కటి కాబోతున్న సంగతి తెలిసిందే. దీనికి సంబంధించి ఇటీవలే నరేష్, ఓ వీడియో విడుదల చేశాడు. అందులో నరేష్, పవిత్ర.. లిప్ టు లిప్ కిస్ పెట్టుకుంటూ కనిపించారు. ఇంతకీ, నరేష్ తన మూడో భార్య రమ్య రఘుపతి కి విడాకులు ఇచ్చాడా.? లేదా.? ప్రస్తుతానికి ఈ విడాకుల అంశం కోర్టు పరిధిలో వుంది. విడాకుల్ని తాను కోరలేదనీ, ఆయనతో కలిసి వుండాలన్నదే తన అభిమతమని రమ్య రఘుపతి అంటున్నారు.

కాళ్ళు ఎందుకు పట్టుకున్నాడో.. తప్పు చేయడం నరేష్‌ కి షరామామూలు వ్యవహరామనీ, ఎఫైర్లు నిత్యకృత్యమనీ, ప్రతిసారీ ఆ ఎఫైర్ల గురించి తనకు తెలిస్తే.. వెంటనే వచ్చి కాళ్ళు పట్టుకునేవాడని వాపోయింది రమ్య రఘుపతి. ‘నరేష్ ద్వారా నాకొక కుమారుడున్నాడు. వాడి భవిష్యత్తుని నాశనం చేయడం ఇష్టం లేదు నాకు. అందుకే, సింగిల్ పేరెంట్‌గా వుండలేక, నరే్‌తో ఎన్నో అవమానాలు భరించాను..’ అని చెప్పుకొచ్చారామె. ఇప్పుడిక చేయగలిగేదేమీ లేదనీ, విడాకులు విషయాన్ని నరేష్‌కే వదిలేశాననీ, నాలుగో పెళ్ళి చేసుకున్నా నరేష్.. దానికి కట్టుబడి వుంటాడనుకోవడంలేదని రమ్య రఘుపతి చెప్పడం గమనార్హం