కాటుక కళ్ల కాజల్ అగర్వాల్ అంటే ఎప్పుడూ క్రేజ్ ఎక్కువే. అందుకే పెళ్లయినా ఏమాత్రం ఆ క్రేజ్‌కి ఢోకా లేదు కాజల్‌కి. పెళ్లి చేసుకుని, ఓ బిడ్డకి తల్లి కూడా అయ్యింది ఇటీవలే కాజల్ అగర్వాల్. తల్లిగా పొందాల్సిన అనుభూతిని పొందుతూనే కెరీర్‌లో సక్సెస్‌ఫుల్‌గా ముందుకు సాగుతోంది. ప్యాండమిక్ టైమ్‌లో తన పర్సనల్ లైఫ్‌ని అందంగా మలచుకుని, మళ్లీ ప్రొఫిషనల్ లైఫ్‌లో బిజీ అయిపోయింది కాజల్. దటీజ్ చందమామ.! కాజల్ ప్రస్తుతం ‘ఇండియన్ 2’ సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో కాజల్ జస్ట్ గ్లామరస్ పాత్రతో సరిపెట్టుకోకుండా, ఇంపార్టెన్స్ వున్న రోల్ పోషిస్తుండడం విశేషం.
ఈ పాత్ర కోసం ఏకంగా ప్రత్యేకమైన యుద్ధ విద్యల్లో శిక్షణ తీసుకుంటోందంటేనే కాజల్ పాత్ర ఈ సినిమాలో ఎంత కీలకంగా వుండోబోతోందో అర్ధం చేసుకోవచ్చు. ఇక, తెలుగులోనూ కాజల్ అగర్వాల్ కోసం కొన్ని క్రేజీ ప్రాజెక్టులు సిద్ధమవుతున్నాయట. సోషల్ మీడియా విషయానికి వస్తే, కాజల్ అగర్వాల్ చాలా చాలా యాక్టివ్. తన పర్సనల్ లైఫ్‌కి సంబంధించిన అంశాలే కాదు, ప్రొఫిషనల్ అప్‌డేట్స్ కూడా ఇస్తూ వుంటుంది. దాంతో పాటూ, గ్లామర్ యాంగిల్స్‌తోనూ మతులు పోగొడుతుంటుంది. తాజాగా బాస్ లేడీ గెటప్‌లో కాజల్ చేస్తున్న గ్లామర్ హల్‌చల్‌కి గుండె జారి గల్లంతయ్యిందే అంటూ కుర్రకారు హుషారెత్తిపోతున్నారు.