గత సంవత్సరం నుండి మీడియా ఛానల్స్ లో ఎక్కడ చూసినా, సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా నరేష్ పవిత్ర లోకేష్ ల వ్యవహారమే చాలా వైరల్ అవుతుంది. ఈ నేపథ్యంలోనే నరేష్ మూడో భార్య రమ్య రఘుపతి కూడా రంగంలోకి దిగి వీరిపై ఇప్పటికే ఎన్నో విమర్శలు చేసింది. తాజాగా ఓ ఇంటర్వ్యూలో రమ్య రఘుపతి మాట్లాడుతూ పవిత్ర లోకేష్ నరేష్ పై కొన్ని షాకింగ్ కామెంట్స్ చేసింది. రమ్య రఘుపతి (Ramya Raghupathi) మాట్లాడుతూ.. నేను ఉండగా నరేష్ ని ఇంకో పెళ్లి చేసుకోనివ్వను. అలాగే నేను విడాకులు కూడా ఇవ్వను.. పవిత్ర లోకేష్ (Pavithra lokesh) ని నరేష్ పెళ్లి ఎలా చేసుకుంటాడో చూస్తాను. నేను పవిత్ర లోకేష్ నరేష్ లు ఇద్దరు కలిసి హోటల్లో ఉన్నప్పుడు అక్కడికి 6 గంటలకు వెళ్లి డోర్ కొడితే 8:30 వరకు వాళ్లు డోర్ తీయలేదు.ఇక ఆ టైంలో నాకు పవర్ టీవీ ఛానల్ వాళ్ళు చాలా ధైర్యం ఇచ్చి అండగా నిలిచారు. ఇక ఛానల్ వాళ్ళు స్ట్రింగ్ ఆపరేషన్ చేయడం వల్ల అసలైన నిజాలు బయటికి వచ్చాయి. నా భర్త నాకు విడాకులు ఇచ్చి పవిత్రని పెళ్లి చేసుకోవాలి అనుకుంటున్నాడు.
కానీ పవిత్ర మాత్రం కేవలం డబ్బు కోసమే నరేష్ ని పెళ్లి చేసుకోవాలని భావిస్తుంది. నేను పవిత్ర లోకేష్ నరేష్ (Naresh-Pavithra Lokesh) లు ఉన్న హోటల్ కి వెళ్ళినప్పుడు తలుపు తీయడంతోనే పవిత్ర ఒక బూతు మాటతో నన్ను తిట్టింది. అందుకే నాకు చాలా కోపం వచ్చింది. ఆ కోపంలో నేను చెప్పుతో కొట్టాలి అనుకున్నాను. అయితే నేను 6 గంటలకు తలుపు కొడితే 8:30 వరకు వాళ్లు రూమ్ లో నుండి బయటకు రాలేదు. ఇక ఆ టైంలో వాళ్ళు ఏం మాట్లాడుకుంటున్నారో మీడియా వాళ్లకి కూడా తెలియదు. నేను నరేష్ ని ఏదైనా అనాలనుకుంటే ఇంట్లోనే అంటాను. కానీ అలా బజారులో పెట్టను. వాళ్లు చేసే పనుల వల్లే వాళ్లు ఇండస్ట్రీలో సోషల్ మీడియాలో సమాజంలో చాలా నెగిటివిటీని మూటగట్టుకున్నారు. అయితే ఆ హోటల్లో ఉన్న రోజు ఎంతసేపు కొట్టినా డోర్ తీయకపోవడంతో నరేష్ ని పవిత్ర లోకేష్ ఏమైనా చేస్తుంద.. ఆమె నరేష్ (Naresh) ని ఏమైనా తిడుతుందా అనిపించింది.అంతేకాదు పవిత్ర నరేష్ ని చంపేస్తుందేమో అనే భయం నాకు కలిగింది అంటూ రమ్య రఘుపతి (Ramya Raghupathi) ఆ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చింది. ప్రస్తుతం రమ్య రఘుపతి మాట్లాడిన మాటలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.