చిరంజీవి వాల్తేరు వీరయ్య మరియు బాలకృష్ణ వీర సింహారెడ్డి సినిమాలు సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు రాబోతున్న విషయం తెల్సిందే. ఈ రెండు సినిమాలను కూడా మైత్రి మూవీ మేకర్స్ వారు నిర్మించడంతో పాటు ఈ రెండు సినిమాలను కూడా వారే స్వయంగా డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారు. ఈ సినిమాలను భారీ ఎత్తున ఏపీ మరియు తెలంగాణలో విడుదల చేసేందుకు నిర్మాతలు సిద్ధం అయ్యారు. కానీ వారికి ఎగ్జిబిటర్స్ షాక్ ఇచ్చారు. తమ కమీషన్ ఎక్కువ ఇవ్వాల్సిందే అంటూ డిమాండ్ చేస్తూ అడ్వాన్స్ బుకింగ్ ను ఇప్పటి వరకు మొదలు పెట్టలేదు.
ఒక వైపు అమెరికాలో అడ్వాన్స్ బుకింగ్ మొదలు అయ్యి భారీగా వసూళ్లు నమోదు చేస్తూ ఉంటే మరి కొన్ని గంటల్లో వీర సింహారెడ్డి యొక్క సినిమా విడుదల ఉన్నా కూడా బుకింగ్ మొదలు కాకపోవడంతో అభిమానులు ఆందోళన వ్యక్తం చేశారు. ఎట్టకేలకు ఎగ్జిబిటర్స్ మరియు నిర్మాతల మధ్య ఒప్పందం కుదరడం తో చర్చలు సఫలం అయ్యాయి అంటూ ప్రకటించి అడ్వాన్స్ బుకింగ్స్ ను మొదలు పెట్టినట్లుగా సమాచారం అందుతోంది. పూర్తి స్థాయిలో 11వ తారీకు నుండి వీర సింహారెడ్డి మరియు వాల్తేరు వీరయ్య సినిమాల యొక్క టికెట్లు అడ్వాన్స్ బుకింగ్ ద్వారా అందుబాటులో ఉంటాయి.