ఈ మధ్యకాలంలో సమంత గురించి సోషల్ మీడియాలో చాలా వార్తలు వైరల్ అవుతున్నాయి. ఎందుకంటే సమంత నటించిన శాకుంతలం సినిమా విడుదల కానున్న నేపథ్యంలో ఆమె తనకు వ్యాధి వచ్చినప్పటి నుండి ఎక్కువగా మీడియా ముందుకు రాలేదు. అయితే శాకుంతలం సినిమా రిలీజ్ కావడం వల్ల మూవీ ప్రమోషన్స్, ప్రీ రిలీజ్ ఈవెంట్ లలో పాల్గొంది. అయితే సమంత గత ఏడాది మయాసైటిస్ అనే వ్యాధి బారిన పడినట్లు అఫీషియల్ గా ప్రకటించింది.ఈ విషయం తెలిసిన చాలా మంది సమంత పై జాలి చూపించారు. అంతేకాదు ఆ తర్వాత సమంత హీరోయిన్గా వచ్చిన యశోద (Yashoda) సినిమా సూపర్ హిట్ అయింది. ఇక నాగచైతన్యతో విడాకుల వల్ల సమంత డిప్రెషన్ లోకి వెళ్లి అలాగే యశోద సినిమా కోసం వర్కౌట్లు చేస్తూ తన ఆరోగ్యం మీద పూర్తిగా దృష్టి పెట్టడం మానేసి మయాసైటిస్ వ్యాధి బారిన పడింది. అయితే శాకుంతలం (Shakunthalam) సినిమాకి సంబంధించిన ఓ ప్రెస్ మీట్ లో సమంత చాలా ఎమోషనల్ అవుతూ కన్నీళ్లు పెట్టుకున్న సంగతి మనకు తెలిసిందే. అయితే సమంతని అలా ఎమోషనల్ అవడం చూసిన చాలా మంది ప్రేక్షకులు తట్టుకోలేక పోయారు. కానీ సమంత ఏడుపు చూసినా ఓ నిర్మాత మాత్రం సమంత పై షాకింగ్ కామెంట్స్ చేశారట. ఇంతకీ ఆ నిర్మాత ఎవరో ఇప్పుడు తెలుసుకుందాం. సమంత శాకుంతలం సినిమా గురించి ఎలాంటి శ్రమ పడిందో ఎన్ని ఇబ్బందులు ఎదుర్కొందో వాటిని తలుచుకుంటూ సమంత స్టేజ్ పై చాలా ఎమోషనల్ అయింది.
కానీ ఆమె ఏడుపు చూసినా నిర్మాత చిట్టి బాబు (Chittibabu) మాత్రం ఆమెను ఎద్దేవా చేస్తున్నారు. చాలామంది హీరోయిన్లు ప్రయోగాత్మక పాత్రల్లో నటించారు కానీ నీలా మాత్రం ఎవరు ఏడవలేదు. సినిమా అంటేనే కచ్చితంగా అందులో ప్రతి ఒక్కటి చేయగలగాలి. అలా అయితేనే ఇండస్ట్రీలో ఎదగగలరు. అనుష్క దేవసేన, జేజమ్మ వంటి పాత్రలు పోషించింది కానీ ఆమె ఏనాడూ కూడా అలా కన్నీళ్లు పెట్టుకోలేదు. కానీ నువ్వు మాత్రం ఏదో ఎక్కువ చేసినట్టు బిల్డప్ ఏడుపు ఎందుకు ఏడుస్తున్నావ్ ఓవరాక్షన్ చేయడం ఎందుకు అంటూ నిర్మాత చిట్టి బాబు (Chittibabu) సమంత పై కొన్ని షాకింగ్ కామెంట్స్ చేశారు. అలాగే సమంత కి వచ్చిన వ్యాధి అంత ప్రాణాంతకం ఏమీ కాదు కానీ ఆమె ప్రతిసారి నేను బతుకుతానో చనిపోతానో అన్ని మాట్లాడడం ఏమీ బాగాలేదు. అసలు ఆమెకు ఇలాంటి మాటలు ఎవరు చెబుతున్నారో కానీ వాళ్లు ఆమెలో మరింత ఒత్తిడి పెంచుతున్నారు అంటూ నిర్మాత చిట్టిబాబు కొన్ని షాకింగ్ కామెంట్స్ చేశారు. ప్రస్తుతం సమంత (Samantha) పై చిట్టిబాబు చేసిన కామెంట్లు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.మరి దీనిపై సమంత ఏ విధంగా స్పందిస్తుందో వేచి చూడాలి.