ఓ మహిళను లైంగికంగా వేధించిన కేసులో మలయాళ సినీ నటుడు ఉన్ని ముకుందన్‌పై (Unni Mukundan) ట్రయల్ కోర్టు విచారణపై స్టేను కేరళ హైకోర్టు గురువారం రద్దు చేసింది. మహిళ పిటిషన్‌పై హైకోర్టు ఈ నిర్ణయం తీసుకుంది. ఈ వ్యవహారంలో తప్పుడు అఫిడవిట్ దాఖలు చేయడం ద్వారా నటుడు కోర్టును తప్పుదోవ పట్టించారని ఆ మహిళ పేర్కొంది. ఈ విషయంలో మధ్యంతర స్టే మంజూరు చేయబడింది. తప్పుడు అఫిడవిట్ దాఖలు చేయడం ద్వారా స్టే ఆర్డర్ పొందినట్లయితే అది చాలా తీవ్రమైన విషయం అని కోర్టు పేర్కొంది. ఈ వ్యవహారంలో కౌంటర్ అఫిడవిట్ దాఖలు చేయాలని ముకుందన్‌ను కోర్టు ఆదేశించింది. మలయాళ నటుడు ఉన్ని ముకుందన్‌కు కేరళ హైకోర్టు షాకిచ్చింది. లైంగిక వేధింపుల కేసులో ఇచ్చిన స్టే ఆర్డర్‌ను నిలిపేసింది.బాధిత యువతి కోర్టు బయట కేసును పరిష్కరించుకునేందుకు అంగీకరించినట్లుగా ఒక ఫోర్జరీ పత్రాన్ని కోర్టుకు సమర్పించాడు.
అయితే తను ఎలాంటి సంతకం చేయలేదని బాధిత యువతి తాజాగా కోర్టులో వాంగ్మూలం ఇచ్చింది.ఈ కేసులో ప్రత్యుత్తర అఫిడవిట్ దాఖలు చేయాలని ఉన్ని ముకుందన్‌ను కోర్టు ఆదేశించింది. ఇక అసలు విషయానికి వస్తే.. ఉన్ని ముకుందన్ పై గతంలో ఓ యువతి లైంగిక వేదింపుల కేసు పెట్టింది. యంగ్ హీరో తనపై లైంగిక వేధింపులకు పాల్పడ్డాడని కొట్టాయం పట్టణానికి చెందిన ఓ యువతి 2018లో పోలీసులను ఆశ్రయించింది. తనను స్టోరీ డిస్కర్షన్ అని పిలిపించుకుని తనతో అసభ్యంగా ప్రవర్తించాడని ఫిర్యాదులో పేర్కొంది.ఎక్స్ వైఫ్ తో మళ్ళీ అలా.. హృదయం చలించే ఘటన! ఈ కేసులో ఉన్ని ముకుందన్ తరఫున న్యాయమూర్తి సైబీ జోస్ కిడంగూర్ వాదించాడు. ఈ కేసు క్రమంలో బాధిత యువతి కోర్టు బయట కేసును పరిష్కరించుకునేందుకు అంగీకరించినట్లుగా ఒక ఫోర్జరీ పత్రాన్ని కోర్టుకు సమర్పించాడు. దీంతో సదరు యువతి వేసిన లైంగిక వేధింపుల కేసును హైకోర్టు కొట్టిపారేసింది. అయితే ఈ కేసును తాజాగా హైకోర్టు రీ ఓపెన్ చేసింది . ఈ కేసులో అఫిడవిట్ దాఖలు చేయాలని ఉన్ని ముకుందన్ ను ఆదేశిస్తూ కేసును ఈ నెల 17కి వాయిదా వేసింది.