CINEMA

మహేష్ బాబుతో త్రివిక్రమ్ సెంటిమెంట్ ట్విస్ట్.. వర్కౌట్ అయితే బిగ్గెస్ట్ హిట్

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు సర్కారు వారి పాట సినిమా అనంతరం త్రివిక్రమ్ తో ఒక క్రేజీ ప్రాజెక్ట్ చేస్తున్నాడు. ఇక మహేష్ బాబు కెరీర్ లో 28వ సినిమాగా రూపొందుతున్న ఈ సినిమా గురించి అనేక చర్చలు జరుగుతున్నాయి. ఈ సినిమా టైటిల్ ఇంకా ఫిక్స్ చేయలేదు. కానీ ప్రస్తుతానికి మహేష్ బాబు 28వ సినిమాగా సంబోధిస్తున్నారు. త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో మహేష్ బాబు సరసన పూజా హెగ్డే శ్రీ లీల హీరోయిన్లుగా నటిస్తున్నట్లు ఇప్పటికే క్లారిటీ వచ్చేసింది. పూజా హెగ్డే విషయాన్ని అధికారికంగా ప్రకటించారు. కానీ శ్రీ లీల విషయాన్నీ ఆఫ్ ది రికార్డ్ గా ప్రకటించారు. సినిమా నిర్మాత నాగవంశీ హారిక హాసిని క్రియేషన్స్ బ్యానర్ మీద చినబాబు, నాగవంశీ ఈ సినిమాని అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. ఇక ఈ సినిమాలో మహేష్ బాబు ఒక పోలీస్ ఆఫీసర్ పాత్రలో నటిస్తున్నట్లుగా గతంలోనే ప్రచారం జరిగింది. ఇక ఈ విషయంలో మహేష్ బాబు అభిమానులు సెంటిమెంట్ గా ఫీల్ అవుతున్నారు.

ఎందుకంటే మహేష్ బాబు పోలీస్ అధికారిగా నటించిన గత సినిమాలు సూపర్ హిట్ గా నిలిచాయి. పోకిరి సినిమా, దూకుడు సినిమాలో అయితే ఆయన కెరియర్ లో ది బెస్ట్ సినిమాలుగా నిలిచిన నేపథ్యంలో ఈ సినిమా ఎలా ఉండబోతోంది అనే విషయం మీద సర్వత్రా ఆసక్తి నెలకొంది. పూరి జగన్నాథ్ దర్శకత్వంలో తెరకెక్కిన పోకిరి సినిమా అయితే మహేష్ కెరియర్ లో బెస్ట్ సినిమాగా నిలవడమే కాదు. అప్పటివరకు తెలుగు సినిమా రికార్డులన్నింటినీ చేరిపేసింది. తర్వాత వచ్చిన దూకుడు సినిమా కూడా మహేష్ కెరియర్ లో ది బెస్ట్ కలెక్షన్స్ రాబట్టింది. ఆగడు లాంటి సినిమా ఇబ్బంది పెట్టినా మహేష్ బాబుకి పోలీస్ సెంటిమెంట్ బాగా కలిసి వస్తుందని అభిమానులు అంచనాలు వేస్తున్నారు. కచ్చితంగా ఆయనకు పోలీస్ రోల్ కలిసి వస్తుందని SSMB 28 సినిమా బంపర్ హిట్ అవుతుందని వారంతా ఆశ పడుతున్నారు. చూడాలి మరి ఏమవుతుందో.