CINEMA

రామ్ చరణ్ ఆరెంజ్ మూవీ రీ-రిలీజ్..

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కెరియర్ లో బిగ్గెస్ట్ డిజాస్టర్ గా నిలిచిన చిత్ర ఆరెంజ్. బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాని నాగబాబు భారీ బడ్జెట్ తో నిర్మించారు. కంప్లీట్ గా ఫారిన్ బ్యాక్ డ్రాప్ లోనే ఈ సినిమా తెరకెక్కిన సంగతి తెలిసిందే. ఇక ఈ మూవీలో రామ్ చరణ్ క్యారెక్టర్ లవర్ బాయ్ తరహాలో ఉంటుంది. ప్రేమకి లైఫ్ స్పాన్ తక్కువ అని, ఒక టైమ్ దాటాక అది తగ్గిపోతుంది అని చెబుతూ కొంతకాలం ప్రేమిస్తా అంటూ చెబుతూ ఉంటారు.

ప్రేమ కథని అంత ముందు వరకు ఎవరూ చెప్పని కోణంలో ఈ మూవీలో దర్శకుడు చెప్పే ప్రయత్నం చేశారు. అయితే రెగ్యులర్ ఆడియన్స్ కి ఆ పాయింట్ కనెక్ట్ కాకపోవడంతో మూవీ డిజాస్టర్ అయ్యింది. ఇక ఈ సినిమా ఎఫెక్ట్ తో నాగబాబు అప్పుల్లో కూరుకుపోయాడు. ఈ నేపధ్యంలో ఆరెంజ్ సినిమా తనని ఆర్ధికంగా, మానసికంగా ఏ విధంగా ఇబ్బంది పెట్టింది నాగబాబు కూడా చాలా సందర్భాలలో చెప్పారు. అయితే థియేటర్స్ లో ప్రేక్షకులకి కనెక్ట్ కాని ఆ సినిమా తరువాత మాత్రం బుల్లితెరలో, యుట్యూబ్ ద్వారా యూత్ లో చాలా మందికి నచ్చింది.

ఇప్పటికి ఒక యూత్ ఆరెంజ్ సినిమాని చూడటానికి ఇష్టపడుతూ ఉంటారు. అయితే ఈ టైమ్ లో చేయాల్సిన సినిమాని ఎప్పుడో 15 ఏళ్ళ క్రితమే తీయడం కూడా మూవీకి మైనస్ అనే టాక్ వినిపిస్తూ ఉంటుంది. అయితే ఆరెంజ్ సినిమాని ఇప్పుడు మళ్ళీ రీరిలీజ్ చేయడానికి రెడీ అవుతున్నారు. మార్చి 27న రామ్ చరణ్ బర్త్ డే సందర్భంగా ఈ మూవీని థియేటర్స్ లో రీరిలీజ్ చేస్తున్నట్లు తెలుస్తోంది.

 

Advertisement

మగదీర సినిమాని ముందుగా రీరిలీజ్ చేయాలని అనుకున్న ఎందుకనో వాయిదా పడింది. అయితే ఆరెంజ్ మూవీ రీ రిలీజ్ ద్వారా వచ్చిన కలెక్షన్ మొత్తాన్ని జనసేన పార్టీకి విరాళంగా ఇవ్వాలని నాగబాబు నిర్ణయించుకున్నట్లు సమాచారం. అయితే జెనరేషన్ గ్యాప్ ఉంది కాబట్టి ఇప్పుడు ఆరెంజ్ మూవీకి మంచి ఆదరణ వచ్చే అవకాశం ఉంటుంది అనే టాక్ వినిపిస్తుంది. మరి అది ఎంత వరకు సాధ్యం అవుతుంది అనేది వేచి చూడాలి.