CINEMA

జపాన్ లో వంద కోట్ల కలెక్షన్ దిశగా ఆర్ ఆర్ ఆర్ సినిమా..

ఇండియన్ సినిమా గ్లోరీని ప్రపంచవ్యాప్త సినీ అభిమానులకి పరిచయం చేసిన సినిమా ‘ఆర్ ఆర్ ఆర్’. దర్శక ధీరుడు, ప్రైడ్ ఆఫ్ ఇండియన్ సినిమా రాజమౌళి తెరకెక్కించిన ఈ యాక్షన్ ఎపిక్ డ్రామా రిలీజ్ అయ్యి ఏడాది దాటినా ఇంకా రికార్డుల వేట మాత్రం ఆపలేదు, ఆస్కార్ అవార్డ్ తెచ్చినా అలసిపోలేదు. ఒక ఇండియన్ సినిమా కలలో కూడా చేరుకోలేదు అనుకున్న ప్రతి చోటుకి వెళ్లి మన జెండా ఎగరేసిన ఆర్ ఆర్ ఆర్ సినిమా జపాన్ లో సంచలనం సృష్టిస్తోంది. 164 రోజుల్లో 1 మిలియన్ ఫుట్ ఫాల్స్ ని రాబట్టి ఆర్ ఆర్ ఆర్ సినిమా సెన్సేషన్ క్రియేట్ చేసింది. కేవలం జపాన్ లోనే దాదాపు వంద కోట్ల వరకూ కలెక్షన్స్ ని రాబడుతున్న ఆర్ ఆర్ ఆర్, ఇప్పట్లో స్లో అవుతున్నట్లు కనిపించట్లేదు.

 

ఆర్ ఆర్ ఆర్ రిలీజ్ కన్నా ముందు జపాన్ లో ‘ముత్తు’ సినిమా టాప్ గ్రాసర్ గా ఉండేది. రజినీకాంత్ ఫ్యాన్ బేస్ ని జపాన్ లో స్ట్రాంగ్ చేసిన ముత్తు సినిమా రికార్డులని బ్రేక్ చెయ్యడానికి ఒక ఇండియన్ సినిమాకి పాతికేళ్లు పట్టింది. ఇప్పుడు ఆర్ ఆర్ ఆర్ సినిమా రికార్డ్స్ ని బ్రేక్ చెయ్యాలి అంటే మరో పాతికేళ్లు పడుతుందేమో. ఇదిలా ఉంటే ఆర్ ఆర్ ఆర్ సినిమాని చైనాలో కూడా రిలీజ్ చేస్తామని గతంలో అనౌన్స్ చేశారు కానీ ఇప్పటివరకూ ఎలాంటి అఫీషియల్ అప్డేట్ లేదు. మరి ఆర్ ఆర్ ఆర్ సినిమా చైనా రిలీజ్ ఉంటుందా లేదా అనేది చూడాలి.